నితిన్ కి సపోర్ట్ గా నిలుస్తున్న మహేష్ బాబు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

mahesh babu and nithin
Updated:  2018-08-01 12:07:28

నితిన్ కి సపోర్ట్ గా నిలుస్తున్న మహేష్ బాబు

గత ఏడాది "లై" తో అలాగే ఈ ఏడాది "చల్ మోహన్ రంగ"తో భారీ ఫ్లాప్స్ ని అందుకున్నాడు నితిన్. ఇక ఇప్పుడు ఎలాగైనా మళ్ళి తన సక్సెస్ ట్రాక్ ని బ్యాక్ తెచ్చుకోడానికి "శ్రీనివాస కళ్యాణం" అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో వస్తున్నాడు నితిన్. "శతమానం భవతి" ఫేం అయిన సతీష్ వేగ్నేశ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

ఆగష్టు రెండో వారం నుంచి ఈ సినిమా ధియేటర్స్ లో సందడి చేయనుంది. అయితే ఈ సినిమా యొక్క ట్రైలర్ ని రేపు సాయంత్రం 5:30 కి రిలీజ్ చేయనున్నాడు మహేష్ బాబు. సో ఎప్పుడు తన సినిమా ప్రమోషన్స్ విషయం లో పవన్ కళ్యాణ్ ని నమ్ముకునే నితిన్ ఈ సారి మాత్రం మహేష్ బాబుని నమ్ముకున్నాడు.

మరి మహేష్ బాబు అయిన నితిన్ కి హిట్ తిసుకువస్తాడో లేదో చూడాలి. రాశి ఖాన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి మిక్కి జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.