గడ్డం తీసేసిన మహేష్ బాబు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

hero mahesh
Updated:  2018-07-16 02:44:16

గడ్డం తీసేసిన మహేష్ బాబు

గత కొన్ని రోజులుగా మహేష్ బాబు తన 25 వ సినిమా షూటింగ్ లో గడ్డం పెంచుకొని ఉన్నాడు. స్టూడెంట్ లుక్ వచ్చే లాగ గడ్డం పెంచుకొని కొత్త లుక్ లోకి చేంజ్ అయ్యి మరి షూటింగ్ లో పాల్గొన్నాడు మహేష్ బాబు. అయితే ఇటివలే ఒక షాప్ ఓపెనింగ్ కి వెళ్ళిన మహేష్ బాబు గడ్డం తీసేసి క్లీన్ షేవ్ లుక్ లో దర్శనమిచ్చాడు.
 
దీన్ని బట్టి చూస్తుంటే ఈ లుక్ లో ఉండే మహేష్ బాబు పార్ట్ పూర్తయింది అని అర్ధం అవుతుంది. అలాగే రెండో హెడ్యూల్ కి కూడా ఇంకా చాలా టైం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో అల్లరి నరేష్ మహేష్ బాబు ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. దిల్ రాజు ఇంకా అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
 
పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని వంశీ పైడిపల్లి చాలా క్లాస్ గా డైరెక్ట్ చేస్తున్నాడు అని తెలుస్తుంది. ఇదిలా ఉంటె మహేష్ బాబు ఈ సినిమాలో రెండు లుక్స్ లో దర్శనమివ్వనున్నాడు. రైతుల స‌మ‌స్యల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతుంద‌ని తెలుస్తుంది. ఇందులో విదేశాల నుంచి వ‌చ్చిన కంపెనీ సీఈఓగా న‌టిస్తున్నాడు మ‌హేశ్ బాబు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.