మరో సారి మురగదాస్ ని తగులుకున్న మహేష్ అభిమానులు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

mahesh babu and murugadas
Updated:  2018-08-04 04:33:19

మరో సారి మురగదాస్ ని తగులుకున్న మహేష్ అభిమానులు

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ ఓ అతి పెద్ద డిసాస్టర్ గా నిలిచిన సినిమా "స్పైడర్". మురగదాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఫై మహేష్ అభిమానులు భారి అంచనాలు పెంచుకున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యాక మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ కలిసి మురగదాస్ ని ఒక రేంజ్ లో ట్రోల్ చేసారు. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయ్యి ఏడాది కావొస్తుంది.

ఇప్పుడు మళ్ళి ఈ సినిమా విషయంలో మురగదాస్ ని తిడుతున్నారు మహేష్ అభిమానులు. అసలు ఇప్పుడు మళ్ళి వీళ్ళు మురగదాస్ ని ఎందుకు తిడుతున్నారు అంటే కేవలం "గూడచారి" సినిమా వల్లే. ఈ సినిమా ఇటివలే రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని సాధించింది.

స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో అడివి శేష్ హీరోగా నటించాడు. ఈ సినిమాని చూసిన మహేష్ ఫ్యాన్స్ ఇది అసలైన స్పై థ్రిల్లర్ అంటూ మురగదాస్ ని తిడుతున్నారు. సినిమా రిలీజ్ అయ్యి ఏడాది కావొస్తున్న కూడా మహేష్ అభిమానులు ఇంకా మురగదాస్ పై కోపంగా ఉన్నారు అంటే సినిమా ఏ రేంజ్ లో వాళ్ళని డిసప్పాయింట్ చేసిందో అర్ధం చేసుకోవచ్చు. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.