మల్టీప్లెక్స్ లపై మహేష్ కన్ను

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

mahesh babu
Updated:  2018-09-04 06:21:02

మల్టీప్లెక్స్ లపై మహేష్ కన్ను

టీవీ ప్రేక్షకులకు కూడా దగ్గరవ్వాలనే నేను టీవీ యాడ్స్ ఒప్పుకుంటున్నా అంటూ ఓ సందర్భంలో చెప్పాడు మహేష్ బాబు. ఆ తర్వాత అతను తెలుగులోనే అత్యధికంగా సంపాదిస్తున్న హీరోగా పేరు దక్కించుకున్న విషయం తెల్సిందే. ఆమద్య ఫోర్బ్స్ జాబితాలో కూడా మహేష్ బాబు స్థానం దక్కించుకున్నాడు.ఆయన భార్య నమ్రత ఎప్పుడు ఆయన సంపాదన విషయం లో అన్ని వ్యవహారాలు చూసుకుంటూ ఉంటారు. ఆయన ఇప్పటికే అమరావతిలోను, వైజాగ్ లోను రియల్ ఎస్టేట్ రంగం లో పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తోంది.
 
అమరావతిలో ఆయనే ఎక్కువ భూములు కొనుగోలు చేసిన హీరోగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టిన మహేష్ బాబు తాజాగా మల్టీప్లెక్స్ బిజినెస్ లో ఎంటర్ అవ్వాలని భావిస్తున్నాడు. ఏషియన్ ఫిల్మ్స్తో కలిసి మహేష్ బాబు గచ్చిబౌలీలో భారీ మల్టీప్లెక్స్ కు శ్రీకారం చుట్టనున్నారు..
 
గచ్చిబౌలిలో ఇప్పటికే భూములు కొనుగోలు చేసి భావన నిర్మాణం చేపట్టినట్టు సమాచారం.. మహేష్ బాబు - ఏషియన్ ఫిల్మ్ చేపట్టబోతున్న ఈ మల్టీప్లెక్స్ సక్సెస్ అయితే తెలుగు రాష్ట్రాతో పాటు పలు ముఖ్య పట్టణాల్లో కూడా మల్టీప్లెక్స్లను నిర్మించాలనే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.