తండ్రి కొడుకుల మధ్య గొడవ

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

mahesh babu
Updated:  2018-09-05 06:18:02

తండ్రి కొడుకుల మధ్య గొడవ

మహేష్ బాబు ఎంత పెద్ద హీరో అయినప్పటికీ అతని కుటుంబ సబ్యులకు మాత్రం ఒక సాధారణ భర్త, తండ్రి, కొడుకు లానే కనిపిస్తారు. తన షూటింగ్ లతో బిజీ బిజీగా గడిపే ఈ సూపర్ స్టార్ ఇంటికి వెళ్ళాకా పిల్లలతో ఆడుకుంటూ చంటిపిల్లాడు అయిపోతాడు. 

తాజాగా ఇతడు తన గారాల కొడుకు గౌతమ్ తో సరదాగా ఫైట్ చేస్తున్న పిక్ ఒకటి పోస్ట్ చేశాడు. దీంతో ఫాన్స్ తెగ సంబర పడిపోతున్నారు. మొన్నామధ్య “మహర్షి” షూటింగ్ అప్పుడు తన కూతురు సీతార తో కలిసి మొక్కలు నాటుతూ కనిపించిన మహేష్ మళ్ళి ఇప్పటి వరకు కనబడలేదు. ఇదివరకు సూపర్ స్టార్ కృష్ణ గారు మహేష్ బాల నటుడిగా ఉన్నప్పుడు తండ్రి కొడుకుల మధ్య పోరాట సన్నివేశాలు అభిమానులకు గుర్తొచ్చాయి. మహేష్ బాలనటుడిగా సినిమాలు చేస్తున్న టైంలోనే కృష్ణతో కలిసి ముగ్గురు కొడుకులు-కొడుకు దిద్దిన కాపురం-గూఢచారి 116 లాంటి సినిమాల్లో ప్రతినాయకులతో ఒక ఆటాడుకున్నాడు.

మహేష్ కృష్ణ గారితో కలిసి చాలా సినిమాల్లో నటించాడు. అచ్చం ఇలానే గౌతమ్ మహేష్ లను కూడా చూడాలని అభిమానుల కోరిక. “1 నేనొక్కడినే” చిత్రంతో ఈ కల కొంచెం నెరవేరినా అది నిడివి తక్కువ కావడం వాళ్ళ గౌతమ్ ను పూర్తిగా చూడలేకపోయారు. కానీ నమ్రత గారు ఈ విషయం లో ఓ క్లారిటీ ఇచ్చేశారు. పిల్లలిద్దరూ వారి వారి చదువులు అయ్యేవరకు సినిమాలకు దూరంగానే ఉంటారు అని చెప్పేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.