“మా” నుండి బయటకు వచ్చేసిన మహేష్ బాబు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

mahesh babu
Updated:  2018-09-07 11:56:08

“మా” నుండి బయటకు వచ్చేసిన మహేష్ బాబు

‘మా’ లో జరుగుతున్న కీచులాట అందరికీ తెలిసిందే. నిధుల దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. శివాజీరాజా వర్గం మరియు నరేష్ వర్గం అని రెండుగా చీలిపోయి ఒకరిమీద మరొకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. శివాజీరాజా దుర్భాషలాడుతూ విలేఖరుల సమావేశంలో రంకెలేసి వివాదానికి వన్నె తెచ్చారు. మరోపక్క నరేశ్ తనకేం తెలియదు నేను అమయకుడిని అంటూ ఏవేవో రుజువులు చూపించి నమ్మించి ప్రయత్నం చేశారు. శ్రీరెడ్డి అనూచిత వ్యాఖ్యలు శివాజీరాజా మీద అనుమానాలను ఇంకా బలం చేశాయి.
 
ఇలా జరగడం మా లో కొత్తేమీ కాదు. దీనివల్ల ‘మా’ పరువు మంట గలిసింది. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ‘మా’ నుండి బయటకు వచ్చేస్తున్నట్టు తెలిపారు. చిరంజీవి అమెరికా ప్రయాణ విషయంలో మా ప్రెసిడెంట్ శివాజీరాజా కింత మొత్తాన్ని సొంత జేబుకు తరలించినందువల్ల మహేష్ ప్రధానంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
 
‘మా’ ఏక్సిక్యూటివ్ సభ్యుడు బెనర్జీ, నమ్రత అమెరికా ప్రయాణ వ్యవహారాలన్నీ చూసుకున్నాడు. కాగా అందులో ఎటువంటి అవకతవకలు జరగ్గపోవడం విశేషం. 
 
పలు సేవకార్యక్రమాల్లో తరచు పాల్గొనే మహేష్ బాబు తాను నడుపుతున్న ఒక స్వచ్ఛంద సంస్థకు ఇప్పుడు ఫండ్ రైసింగ్ మొదలు పెట్టారు. వచ్చిన మొత్తాన్ని చిన్నారుల ఆరోగ్యం మెరుగుపరచటానికి ఉపయోగిస్తారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.