జూలై 20 కి సెట్ చేసిన మంచు లక్ష్మి

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-07-06 18:26:52

జూలై 20 కి సెట్ చేసిన మంచు లక్ష్మి

మంచు వారు ఫ్యామిలీ నుంచి నటిగా వచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైన పేరు తెచ్చుకుంది మంచు లక్ష్మి. అటు నటిగా ఇటు యాంకర్ గా కెరీర్ లో అంచలంచెలుగా ఎదుగుతూ వెళ్తుంది మంచు లక్ష్మి. ఇదిలా ఉంటే మంచు లక్ష్మి ప్రస్తుతం "వైఫ్ అఫ్ రామ్" అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. పూర్తి స్థాయి లేడీ ఓరియెంటెడ్ సినిమా గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సామ్రాట్ మంచు లక్ష్మి కి భ‌ర్త‌గా నటిస్తున్నాడు.
 
తన భర్త ని ఎవరు చంపారు అసలు ఎందుకు చంపారు అని తెలుసుకోవాలి అనే క్యారెక్టర్ లో మంచు లక్ష్మి కనిపించనుంది. పూర్తి స్థాయి థ్రిల్లర్ నేపధ్యం గా తెరకెక్కిన ఈ సినిమా జూలై 20 న రిలీజ్ కానుంది. ఈ రిలీజ్ డేట్ ని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.
 
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్న ఈ సినిమా షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి చేసుకుంది. విజయ్ ఎలికంటి ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఇంకా మంచు ఎంటర్టైన్మెంట్స్ పై విశ్వ ప్రసాద్, మంచు లక్ష్మి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

షేర్ :