) సినిమాలు మానేస్తున్న మంచు మనోజ్ ?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

manchu manoj
Updated:  2018-09-08 11:41:43

) సినిమాలు మానేస్తున్న మంచు మనోజ్ ?

కొద్ది కాలం క్రితం సినిమాలు మానేస్తున్నాను అని మంచు మనోజ్ ట్వీట్ చేసి కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఆ ట్వీట్ ని తరవాత డిలీట్ చేసి అంతా ఉత్తుత్తినే అంటూ కవరింగ్ ఇచ్చుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు అలాంటిదే ఇంకొకటి చేసాడు. కాకపోతే ఈ సారి సరదా కోసమే అని క్లియర్ గా తెలిసిపోతుంది.

మంచు వారి అభిమాని ఒకరు ”అన్నా….రాత్రి నా కల్లో కొచ్చావ్ ! నువ్వు పసిపిల్లాడిలా బురద పొలంలో ఆడుకుంటున్నావ్" అంటూ ట్వీట్ చేసాడు. దానిని చూడడమే కాకుండా రిప్లై కూడా ఇచ్చాడు మనోజ్. "మా ఊరెళ్ళి హాయిగా వ్యవసాయం చేసుకుంటానని ”అంటూ ఆ అభిమానికి సరదాగా సమాధానం ఇచ్చాడు. చాలా వినసొంపుగా ఉందని, పొలంకు వెళ్లి చాలా సంవత్సరాలు అయ్యిందని. 

ఈసారి మా ఊరెళ్ళి స్వయంగా పొలం పండిస్తానని ట్వీట్ చేసాడు. మంచు మనోజ్ ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు పూర్తి అవుతున్నా బలమైన హిట్ ఒక్కటి కూడా అతని ఖాతాలో లేదు. అయితే అతను చేసిన పాత్రలన్నీ వైవిధ్య భరితమైన పాత్రలే. మనోజ్ ఎనర్జీ లెవెల్స్ ఏ వేరు. అల్లరి బాగా చేస్తాడు ఎంత అల్లరి చేసినా అది వృత్తి మీద ప్రభావ చూపించకుండా జాగ్రత్త పడతాడు. అలాగే సహాయక చర్యల్లో కూడా ముందుంటాడు.

 

షేర్ :