త్రివిక్రమ్ వలనే నేను ఈరోజు ఈ స్థాయి లో ఉన్నా..మానిక్ రెడ్డి

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

trivikram
Updated:  2018-11-01 06:01:31

త్రివిక్రమ్ వలనే నేను ఈరోజు ఈ స్థాయి లో ఉన్నా..మానిక్ రెడ్డి

ఆకు తింటావా ఆకు అంటూ ఒక డైలాగు అరవింద సమేత చిత్రంలో బాగా పేలింది.సోషల్ మీడియాలో కూడా ఈ డైలాగు ని సందర్భానుసారంగా వాడేస్తున్నారు నెటిజన్లుఅయితే ఆ డైలాగు చెప్పిన నటుడి పేరు మానిక్ రెడ్డి. అంతకు ముందు పలు చిత్రాల్లో నటించాడు మానిక్ రెడ్డి. అయితే ఏ సినిమా తోను అంతగా గుర్తింపు రాలేదు. ఇప్పుడు అరవింద సమేతలో చేసింది చిన్న పాత్ర అయినా కొంచెం జనాలు గుర్తిస్తున్నారు.
 
త్రివిక్రమ్ కు ఆప్త మిత్రుడు అయిన మానిక్ రెడ్డి తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో త్రివిక్రమ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు. ఇంటర్వ్యూలో అతను చెప్పిన విశేషాలు అతని మాటల్లోనే "త్రివిక్రమ్ రచయితగా అవకాశాల కోసం కష్టపడుతున్నప్పటి నుండి కూడా నాకు తెలుసు. అవకాశాల కోసం కష్టపడ్డప్పుడు ఎలా ఉండేవాడో -ఇప్పుడు కూడా ఆయన అలాగే ఉన్నాడు. ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా - మునుపటి మాదిరిగానే అందరిని గౌరవించడం - అందరితో ప్రేమగా ఉండటం చూస్తున్నాను. సినిమాలతో సమాజానికి ఏదైనా మంచి సందేశం ఇవ్వాలనేది త్రివిక్రమ్ తాపత్రయం.
 
అంటూ త్రివిక్రమ్ ని ఆకాశానికి ఏత్తెశాడు మానిక్.ఇక అతడు సినిమా షూటింగ్ కోసం చెప్తూ, మహేష్ ని ఇబ్బంది పెట్టిన రోజుల కోసం చెప్పాడు. అతడు సినిమా షూటింగ్