ప‌ద్మావ‌తి దారిలో మ‌రో సినిమా

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-02-06 11:57:14

ప‌ద్మావ‌తి దారిలో మ‌రో సినిమా

బాలీవుడ్ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో కొద్ది కాలంగా వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా మారుతోంది... చ‌రిత్ర‌ను ఆధారంగా చేసుకుని కొంత మంది ద‌ర్శ‌కులు అధిక బ‌డ్జెట్ తో సినిమాల‌ను చిత్రిస్తున్నారు... అలా చ‌రిత్ర‌ను ఆధారంగా చేసుకుని తీసిన సినిమా ప‌ద్మావ‌తి.... ఈ సినిమా షూటింగ్ మెద‌లు అయిన‌ప్ప‌టి నుంచి అష్ట క‌ష్టాలు ప‌డి తెర‌పైకి తీసుకువ‌చ్చారు ద‌ర్శ‌క నిర్మాత‌లు... అయితే ఒక వైపు ప‌ద్మావ‌తి సినిమాని నిషేధించాలంటూ రాజ్ పుత్ క‌ర్ణిసేన దేశ‌వ్యాప్తంగా ఆందోళ‌న‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.
 
అయితే తాజాగా మ‌రో సారి చ‌రిత్ర‌ను ఆధారంగా చేసుకుని బాలీవుడ్ లో నిర్మించాల‌నుకుంటున్నాడు ఓ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు... ఈ సినిమాకు సంబంధించి మ‌ణిక‌ర్ణిక అనే టైటిల్ కూడా ఖ‌రారు చేశారు... రాణి ఝాన్సీ లక్ష్మీబాయ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో కంగన రనౌత్ ముఖ్యపాత్రలో న‌టించ‌నున్నారు. ఈస్ట్ ఇండియాకు చెందిన బ్రిటిస్ అధికారితో ల‌క్ష్మిబాయ్ ల‌వ్ సాంగ్  ద‌ర్శ‌కుడు చిత్రీకరిస్తున్నార‌ట‌.
 
కాగా ఈ నేప‌థ్యంలో  కొంత మంది చిత్ర ప‌రిశ్ర‌కు చెందిన ద‌ర్శ‌కులు భార‌త దేశ చ‌రిత్ర‌ను నాశ‌నం చేస్తున్నారంటూ బ్రాహ్మినీ సంఘాలు రోడ్డు పైకి వ‌చ్చి ధ‌ర్నాలు చేప‌డుతున్నారు... సినిమాలు చిత్రించే ముందు వివాదాస్ప‌ద అంశాలు ఉండ‌వ‌ని హామీ ఇచ్చిన‌ త‌ర్వాతే ద‌ర్శ‌కులు సినిమా షూటింగ్స్ మెద‌లు పెట్టాల‌ని అన్నారు.. త‌మ డిమాండ్ పై ప్ర‌భుత్వం వెంట‌నే స్పందించ‌క పోతే భారీ ఎత్తున ధ‌ర్నాల‌ను చేప‌డ‌తామ‌ని హెచ్చ‌రిస్తున్నారు.. ఈ సినిమా విషయంలో  రాజస్థాన్ గవర్నర్ కల్యాణ్ సింగ్, హోం మంత్రి గులాబ్ చంద్ జోక్యం చేసుకోవాల్సిందిగా కొరారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.