పెళ్లికి రెడీ అయిన శ్రియ‌

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

sriya image
Updated:  2018-03-01 10:52:06

పెళ్లికి రెడీ అయిన శ్రియ‌

గ‌త కొంత కాలంగా సినీ ప‌రిశ్ర‌మ‌లో పెళ్లిళ్లు  హోరు కొన‌సాగుతోంది. మ‌రికొంద‌రు త్వ‌ర‌లో పెళ్లి పీట‌లెక్కబోతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. అందులో  ముఖ్యంగా శ్రీయా శ‌ర‌ణ్ గ‌త కొన్ని రోజులుగా పెళ్లికి సిద్దం అయింద‌న్న‌ట్లు వార్త‌లు వెలువ‌డ్డాయి. దీని పై శ్రియాను అనేక మార్లు మీడియా ప్ర‌శ్నించింది. అయితే దీన్ని తోసిపుచ్చతూనే వచ్చింది శ్రియ‌.
 
ఇటీవ‌ల రష్యాకు చెందిన క్రీడాకారుడు, వ్యాపారవేత్త అండ్రీ కొచ్చీవ్‌తో శ్రియ శరన్‌ ప్రేమలొ ఉందని  ప‌లు వార్త‌లు వెలువ‌డ్డాయి. అయితే త్వ‌ర‌లో వీరిరువురు పెళ్లి చేసుకోబోతున్నారు. అది కూడా  మార్చి 17, 18, 19 తేదిల్లో ఉదయ్‌పూర్‌లో మూడురోజులపాటు శ్రియ పెళ్లి గ్రాండ్‌గా జరుగునున్న‌ట్లు సమాచారం.  ఇప్ప‌టికే పెళ్లి ఏర్పాట్లు పూర్తి చేశార‌ట‌.
 
ఈ పెళ్లికి ప్ర‌ముఖులుకు మాత్ర‌మే అహ్వానం పంపిన‌ట్లు తెలుస్తోంది. వచ్చే నెల 18న శ్రియ-ఆండ్రీ హిందూ సంప్రదాయంలో పెళ్లి చేసుకుని, 19న అతిథులు, స్నేహితులకు గ్రాండ్‌ రిసెప్షన్‌ ఏర్పాటుచేస్తారని శ్రియ సన్నిహితవర్గాలు చెబుతున్నాయి. అయితే శ్రియ మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు పెళ్లి గురించి ఎక్కడా స్పందించలేదు. ఇటీవ‌ల శ్రియాను పెళ్లి విష‌యం పై  మీడియా ప్ర‌శ్నించ‌గా ప‌ర్స‌న‌ల్ లైఫ్  మీకు అన‌వ‌స‌రం అంటూ ఘాటుగా స్పందించింది.      
 
 
 
 
 
 
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.