సీక్రెట్ గా సినిమా స్టార్ట్ చేసిన మెగా హీరో

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

tollywood
Updated:  2018-08-17 11:52:17

సీక్రెట్ గా సినిమా స్టార్ట్ చేసిన మెగా హీరో

సాయి ధరం తేజ్ ప్రస్తుతం ఫ్లాప్స్ లో ఉన్నాడు, ఈ మెగా సుప్రీమ్ హీరో ఇప్పుడు ఎలాగైనా హిట్టు కొట్టాలి అనే కసితో ఉన్నాడు. అయితే ఇలాంటి సమయంలోనే మరో మెగా హీరో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమయ్యాడు.

సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా లాంచ్ అవుతున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే అసలు విషయం ఏమిటంటే వైష్ణవ్ మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది అంట. "అప్పట్లో ఒకడుండేవాడు" ఫేం సాగర్ చంద్ర ఈ సినిమా ని డైరెక్ట్ చేస్తుండగా పవన్ కళ్యాణ్ సన్నిహితుడు అయిన రామ్ తాళ్లూరి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

ఈ నిర్మాత ఇటివలే రవితేజతో "నేల టిక్కెట్" అనే సినిమాని ప్రొడ్యూస్ చేసి ఫ్లాప్ ని అందుకున్నాడు. ఇదిలా ఉంటే వైష్ణవ్ తేజ్ సినిమాని ఇలా సైలెంట్ గా మొదలుపెట్టడం వెనుక ఉద్దేశ్యం ఏంటి అని మెగా అభిమానుల అనుమానం. అయితే ఎలాంటి హైప్ లేకుండా వచ్చి సైలెంట్ హిట్టు కొట్టాలి అనే ఉద్దేశం తోనే వైష్ణవ్ తేజ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. 

 

షేర్ :