చిత్ర‌పరిశ్ర‌మ‌లో తాజాగా లైంగిక వేదింపుల క‌ల‌క‌లం

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

film industry
Updated:  2018-10-09 12:34:44

చిత్ర‌పరిశ్ర‌మ‌లో తాజాగా లైంగిక వేదింపుల క‌ల‌క‌లం

మీ టూ ప్ర‌కంప‌న‌లు బాలీవుడ్ ను షేక్ చేస్తున్నాయి. సిని ప్ర‌ముఖుల చీక‌టి కోణాలు ఒక్క‌టిగా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి అయితే ఇప్ప‌టికే నానా ప‌టేర్  లైంగిక వివాధంలో చిక్కుకోగా మ‌రో ప్ర‌ముఖ న‌టుడు అలోక్ నాథ్ పై తాజాగా ఆరోప‌ణ‌లు వెళ్లువెత్తుతున్నాయి. సిని, టీవీ రంగాల‌లో అత్యంత సంస్కార‌వంత‌మైన పాత్ర‌ల‌లో న‌టించే వ్య‌క్తిగా పేరున్న అలోక్ నాథ్ బండారం వెలుగులోకి వ‌చ్చింది.
 
అలోక్ నాథ్ తో త‌న‌కు ఎదురైన చేదు అనుభ‌వాన్ని ప్ర‌ముఖ ర‌చ‌యిత ప్రొడ్యూస‌ర్ వింటానందా త‌న సోష‌ల్ మీడియా ఫేస్ బుక్ లో పంచుకున్నారు.  సుమారు 19ఏళ్లుగా తాను ఇలాంటి స‌మ‌యం కోసం వేచిచూస్తున్నానంటూ అవేధ‌న వ్య‌క్తం చేశారు. అలోక్ నాథ్ త‌న‌పై అత్యాచానం చేశార‌ని వింటానందా ఆరోపిస్తున్నారు. 
 
త‌న‌కు బ‌ల‌వంతంగా మ‌ధ్యం తాపాంచి త‌న‌ను రేప్ చేసిన‌ట్లుగా ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. ఆయ‌న ఒక తాగుబోతు దుర్మార్గుడు, కానీ పైకి మాత్రం సంస్కార‌వంతమైన న‌టుడుగా చ‌లామ‌నీ అయ్యారంటూ విమ‌ర్శించారు. మీ టూ ఉద్య‌మం కార‌ణంగా ఇన్నాళ్ల‌కు త‌న మౌనాన్ని వీడుతున్న‌ట్లు వింటానందా ప్ర‌క‌టించారు. వేట‌గాడి చేతిలో చిక్కి బాద‌ప‌డుత‌న్న మ‌హిళ‌లంద‌రూ త‌మ మౌనాన్ని వీడాల‌ని పిలుపునిచ్చారు.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.