మీటూ ఉద్యమం వల్ల లాభపడిన రానా దగ్గుబాటి

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

rana daggubati
Updated:  2018-11-01 05:18:38

మీటూ ఉద్యమం వల్ల లాభపడిన రానా దగ్గుబాటి

ఈ మీటూ ఉద్యమం వచ్చాక ఇండస్ట్రీలో చాలా మంది మగవాళ్లకు నిద్ర కరువైంది అంటే అది అతిశయోక్తి కాదు. చిన్న లేదు, పెద్దా లేదు , స్టార్ హీరోల నుండి, దర్శక నిర్మాతలు వరకు అందరిని భయబ్రాంతులకు గురిచేసింది ఈ ఉద్యమం.దక్షిణాది లో అగ్ర హీరో ల ని సైతం కోర్టు వైపుకి నడిపిస్తూ ఊపు మీద ఉంది ఈ ఉద్యమం.
 
అయితే మీటూ మొదట్లో బాలీవుడ్ లో మొదలైన , రైజ్ అయింది మాత్రం నానా పటేకర్ పై తాను శ్రీ దత్త చేసిన ఆరోపణలు తోనే.. బాలీవుడ్ లో భారీ దూమరామే రేగింది ఆవిడ వ్యాఖ్యల వల్ల. హౌస్‌ఫుల్‌ 4లో నానా పటేకర్‌ని తొలగించేసారు. 
 
తనూశ్రీ ఆరోపణలు చేస్తోన్నా కానీ అక్షయ్‌కుమార్‌ మాత్రం అతనితో సినిమా చేస్తున్నాడంటూ సోషల్‌ మీడియాలో వచ్చిన విమర్శలు మూలంగా నానాని తప్పించక తప్పలేదు. ఆ చిత్ర దర్శకుడు సాజిద్‌ ఖాన్‌ కూడా లైంగిక ఆరోపణలు ఎదుర్కొని దర్శకత్వం నుంచి తప్పుకున్నాడు.. అలా నానా పటేకర్ తప్పుకోగా, ఖాళీగా ఉన్న ఆ పాత్ర రానా ని వెతుక్కుంటూ వచ్చింది.
 
ఆ పాత్రలో ఉన్న వృద్దాప్య ఛాయలు తొలగించి, రానా కి తగట్టు గా రాసారట. రానాకి ఈ పాత్ర ఆఫర్‌ చేస్తే అతను వెంటనే అంగీకరించినట్టు బాలీవుడ్‌ సమాచారం. మీటూ అంటూ హీరోలకి, దర్శకులకు సినిమా లు చేజారిపోతుంటే, మీటూ వల్ల రానా కి మాత్రం ఈవిధంగా కలిసొచ్చింది అని అంతా అనుకుంటున్నారు.