తన తప్పు లేదంటున్న ఫిల్మ్ మేకర్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

bollywood
Updated:  2018-10-12 05:10:06

తన తప్పు లేదంటున్న ఫిల్మ్ మేకర్

ఒక్కో మీటూ కామెంట్ తో వేడి పెరుగుతూ వస్తోంది. ఇప్పటికే పలువురు మహిళ సెలెబ్రిటీల పేర్లను బయట పెట్టి మరీ వారు తమను లైంగికంగా వేధించారని ఆరోపణలను చేస్తున్నారు. వీళ్ళ కామెంట్లు సోషల్ మీడియా లో సంచలనం సృష్టిస్తున్నారు. తాజాగా ఒక మహిళ బాలీవుడ్ ఫిలిం మేకర్ సుభాష్ ఘాయ్ తనను అత్యాచారం చేశాడని ఆరోపించింది.

ఆమె పేరు వెల్లడించలేదు కానీ, ఒకరోజు ఆ మహిళ స్క్రిప్ట్ డిస్కషన్ కోసమని సుభాష్ ఘాయ్ ఆఫీస్ కి వెళ్లిందట. ఆమెను సుభాష్ ఆఫీస్ కు రెగ్యులర్ గా పిలిచే వాడని, తనతో అసభ్యంగా ప్రవర్తించేవాడని ఆరోపించింది.  కానీ  అప్పట్లో తన కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోవడం వల్ల ఆ జాబ్ చేయడం ఎంతో ముఖ్యమని అందుకే మానలేకపోయానని తెలిపింది.

అలాగే ఒకరోజు కూల్ డ్రింక్ లో మత్తుమందు ఇచ్చి తనను రేప్ చేశాడని చెప్పింది. ఈ విషయం బయటకు చెప్తే జీతం ఇవ్వనని బెదిరించాడని, అందుకే ఈ విషయాన్ని ఎవరితోనూ పంచుకోలేదని తెలిపింది. ఇక ఈ ఆరోపణల పై స్పందించిన సుభాష్ ఘాయ్ అందులో నిజం లేదని, కావాలంటే కోర్టుకు వెళ్లి వాటిని నిరూపించాలని లేకపోతే మాత్రం ఆమెపై పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.