కాస్టింగ్ కౌచ్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..ఇప్ప‌టికి ఈ వెధ‌వ‌లు ఉన్నారు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-08-28 17:01:45

కాస్టింగ్ కౌచ్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..ఇప్ప‌టికి ఈ వెధ‌వ‌లు ఉన్నారు

సీనియర్ నటి అయిన మీనా పదేళ్ళ ముందు స్టార్ హీరోయిన్ గా తెలుగు తమిళ బాషల్లో ఒక రేంజ్ లో వెలిగింది. ఇప్పుడు కూడా ఈ సీనియర్ హీరోయిన్ కి మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ స్టార్ హీరోయిన్ ఇప్పటి కాలంలో లాగే అప్పుడు కూడా కాస్టింగ్ కౌచ్ ఉంది అంటూ చెప్పుకొచ్చింది.
 
ఇంకా ఈ విషయాల గురించి ఆమె మాట్లాడుతూ ఈమె నటిస్తున్న సమయంలో కూడా కొంతమంది అదేపనిగా కాస్టింగ్ కౌచ్ కు పాల్పడే వాళ్ళట. మా రోజుల్లో కూడా వెధవలు ఉన్నారని, ఇప్పుడు వినిపిస్తున్న కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు అప్పుడు కూడా ఉన్నాయని అయితే వాళ్లకు కూడా భార్యా పిల్లలు ఉన్నారన్న విషయాన్నీ మర్చిపోయి హీరోయిన్స్ తో నీచంగా ప్రవర్తించే వారు అని చెప్పుకొచ్చింది ఈ హీరోయిన్.
 
అంతేకాదు అప్పట్లో కూడా కాస్టింగ్ కౌచ్ ఉన్నప్పటికీ నాకు మాత్రం అలాంటి అనుభవాలు ఎదురు కాలేదని అంటోంది, కానీ ప్రతి ఒక్క అమ్మాయి హీరోయిన్ అవ్వాలి అనుకోని ఇండస్ట్రీ కి వస్తే ఇలాంటి వాళ్లకి మాత్రం అస్సలు లొంగవద్దు అని సలహా ఇచ్చింది మీనా.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.