పుట్టిన రోజు నాడు రెండు గిఫ్ట్స్ ని ప్లాన్ చేసిన మెగా స్టార్.

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

megastar chiranjeevi
Updated:  2018-07-20 01:11:12

పుట్టిన రోజు నాడు రెండు గిఫ్ట్స్ ని ప్లాన్ చేసిన మెగా స్టార్.

మెగా స్టార్ అభిమానులకి ఆగస్ట్ నెల అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఆ నెలలోనే చిరంజీవి పుట్టిన రోజు కూడా ఉంది. అలాగే మెగా హీరోలు కూడా మెగా స్టార్ పుట్టిన రోజుకి తమ సినిమా యొక్క ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేస్తారు. అయితే ఈ పుట్టిన రోజు సంధర్బంగా మాత్రం తండ్రి, కొడుకులు ఇద్దరు తమ తమ సినిమాల ఫస్ట్ లుక్స్ తో వచ్చి అదరగోడతారు అట.

ప్రస్తుతం మెగా పవర్ స్టార్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా కి సంభందించిన ఫస్ట్ లుక్ ని ఆగస్ట్ 22 న రిలీజ్ చేస్తారు అట మూవీ యూనిట్. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది.

అదే రోజు చిరంజీవి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న "సై రా" సినిమా ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేస్తారు అంట. రామ్ చరణ్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాని సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు. మొత్తానికి ఆ రోజు రెండు సినిమాల ఫస్ట్ లుక్స్ తో తండ్రి కొడుకులు అభిమానులని సంతోషపెట్టడానికి రెడీ అయ్యారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.