మెహరీన్ టైం అస్సలు బాలేదు..

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

heroine mehereen
Updated:  2018-10-09 01:25:39

మెహరీన్ టైం అస్సలు బాలేదు..

కొన్నిసార్లు సినిమా సూపర్ హిట్ అయినా అందులో నటించిన వారికి అంత పేరు రాకపోవచ్చు. కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన పంజాబీ భామ మెహ‌రీన్‌ కౌర్ పిర్జాదా ది కూడా అదే పరిస్థితి. మొదటి సినిమా హిట్ అయింది. తరువాత వెంటనే రాజా ది గ్రేట్ కూడా హిట్ అయిపోయింది.

ఇక ఈమెను ఎవరూ ఆపలేరు అనుకుంటూ ఉండగా, కేరాఫ్ సూర్య‌, పంతం, జ‌వాన్‌'ఇలా వ‌రుస‌గా డిజాస్ట‌ర్ల‌ని చవిచూసింది. అదే సమయంలో ఒక బ్లాక్ బస్టర్ తరువాత మరొకటి అన్నట్టు సాగిపోతున్న విజయ్ దేవరకొండ తో  నోటా లో నటించింది. తెలుగు, త‌మిళ భాష‌ల్లో విడుదలైన ఈ సినిమా అయినా ఈమె తలరాత మారుస్తుందా అని చూస్తే అది కూడా జరగలేదు. ఈమె పాత్రకు పెద్దగా ఇంపార్టెన్స్ ఏమి లేదు సినిమాలో. విజ‌య్ దేవ‌ర‌కొండకీ మెహరీన్ కు మధ్య పెద్ద చూడదగ్గ రొమాన్స్ కూడా ఏమి లేదు.

ఇక సీరియెస్‌గా సాగే ఈ పొలిటిక‌ల్ డ్రామా లో రొమాన్స్ కి చోటివ్వలేదు. కనీసం సినిమా హిట్ అయ్యిందా అంటే అది కూడా లేదు. ఓపెనింగ్ డే నుండే కలెక్షన్లు పడిపోతూ వచ్చి డిజాస్టర్ గా మారింది. మెహరీన్ టైం అస్సలు బాగాలేదని చెప్పడానికి ఇంకేం కావాలి. ప్రస్తుతం ఈమె వరుణ్ తేజ్, వెంకటేష్ మల్టీస్టార్రర్ ఎఫ్ 2 లో నటిస్తోంది. మరి ఈ సినిమా అయినా ఈమె కెరీర్ కి హెల్ప్ అవుతుందో లేదో.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.