మాయమైన శ్రీ రెడ్డి

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

srireddy
Updated:  2018-04-22 12:24:15

మాయమైన శ్రీ రెడ్డి

ఒక్కసారి నోరు జారితే ఆ మాటను వెనక్కు తీసుకోలేము...అందుకే ఏదైనా మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి..లేకపోతె మనం మాట్లాడే ఆ మాట మనల్ని ఎంతవరకైనా తీసుకువెళ్తుంది..ఇప్పుడు శ్రీ రెడ్డి విషయంలో అదే జరిగింది. వర్మ చెప్పాడని పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ తల్లిపై అనకూడని మాట అన్నారు శ్రీ రెడ్డి...దింతో పెద్ద ఎత్తున విమర్శలపాలు అవుతుంది...శ్రీ రెడ్డి వెనుక ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా యూ - టర్న్ తీసుకొని శ్రీ రెడ్డి కి హ్యాండ్ ఇచ్చి మరో వైపుకు వెళ్లిపోయారు.
 
ఈ విషయంపై నాగబాబు ప్రెస్ మీట్ పెట్టి విమర్శించారు...ఆ తర్వాత పవన్ కళ్యాణ్ జోక్యంతో ఈ ఇష్యూ శ్రీ రెడ్డి, వర్మ నుండి మీడియా అధినేతలపైకి, టీడీపీ అధినేత కుమారుడు వైపుకు వెళ్ళింది...శ్రీ రెడ్డి తన తల్లిపై చేసిన వ్యాఖ్యలతో మనస్తాపం చెందిన పవన్ కళ్యాణ్ దీని వెనుక ఎవరు ఉన్నారు అని అరా తీయగా లోకేష్ పలు మీడియా అధినేతలతో కలిసి ఇదంతా చేస్తున్నారని ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు.
 
రోజుకు సుమారు 6 గంటలకు పైగా శ్రీ రెడ్డిని పిలిచి డిబేట్ లు పెట్టె పచ్చ మీడియా మూగబోయింది...పవన్ జోక్యం తర్వాత శ్రీ రెడ్డి కూడా పెద్దగా మీడియా ముందుకు వచ్చింది లేదు...ఇక ముందు కూడా మీడియా జోక్యంతో శ్రీ రెడ్డి ముందుకు వస్తుందా లేదా తన పోరాటాన్ని ఇంతటితో ఆపుతుందా చూడాలి.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.