దిల్ రాజు బుట్టలో పడ్డ డైరెక్టర్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-07-13 12:33:16

దిల్ రాజు బుట్టలో పడ్డ డైరెక్టర్

ఇటివలే "సమ్మోహనం" సినిమాతో హిట్ ని అందుకున్న దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి. చాలా రోజుల తరువాత ఇండస్ట్రీ కి ఒక మంచి క్లాస్ హిట్ ని అందించాడు మోహన్ అని అందరూ అంటున్నారు. అయితే ఇప్పుడు ఈ దర్శకుడు తన తదుపరి సినిమాని ఇద్దరు హీరోస్ తో తెరకెక్కించనున్నాడు అని తెలుస్తుంది.

స్టార్ ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజు ఈ సినిమా ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. మోహన్ కృష్ణ ఇంద్రగంటి ఇప్పటి వరకు స్టార్ ప్రొడ్యూసర్స్ తో వర్క్ చేయలేదు, కానీ ఇప్పుడు మాత్రం ఈ సినిమా కోసం దిల్ రాజుతో కలిసి పని చేస్తున్నాడు.

పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్ లో ఒక హీరోగా నాని నటిస్తాడు అనే వార్తలు వస్తున్నాయి. మరి ఈ సినిమాలో నటించే ఆ ఇద్దరు హీరోలు ఎవరా అనేది తెలియాలి అంటే అధికారిక ప్రకటన కోసం ఎదురుచూడాల్సిందే. ఇదిలా ఉంటే దిల్ రాజు ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంకా వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో వస్తున్న సినిమాని నిర్మిస్తూ బిజీగా ఉన్నాడు

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.