ఒక్క హిట్ కూడా లేదు కాని చేతి నిండా సినిమాలు ఉన్నాయి...

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

flop heroine
Updated:  2018-10-02 11:10:37

ఒక్క హిట్ కూడా లేదు కాని చేతి నిండా సినిమాలు ఉన్నాయి...

సినిమా ఇండస్ట్రీలో నిలబడాలి అంటే టన్నుల కొద్దీ టాలెంట్ మాట ఎలా ఉన్నా , ఆ టాలెంట్ చూపించుకోడా నికి ఇసుకంత అయినా అదృష్టం ఉండాలి అంటారు.. తన టాలెంట్ ని ఆల్రెడీ చూపించిన చేసిన సినిమా లు ప్లాప్ అయితే ఏమంటారు..?  ఐరెన్ లెగ్ గా పిలుస్తారు... కానీ హిట్ల కి, ప్లాప్ లకి అతీతం గా మరి కొంతమంది ఉంటారు, వాళ్ళకి సినిమా విజయపజాయలతో సంబంధం లేకుండా ఛాన్సులు వస్తూనే ఉంటాయి.. వాళ్లలో ఒక్కరే ''లడ్డులా ఉండే పోరి" మేఘ ఆకాష్..మేఘా ఆకాష్  మొదట్లోనే తమిళ్ లో 'ఎన్ని నొక్కి పాయుం తొట్ట' అనే ధనుష్ సినిమాలో చేసే ఛాన్స్  కొట్టేసింది.. మేఘ లుక్స్ చూసి , ఫిదా అయిపోయిన దర్శకుడు గౌతమ్ మీనన్ తన సినిమాలో హీరోయిన్ గా అవకాశం ఇచ్చాడు.
 
అదేమిటో కానీ ఆ సినిమా షూటింగ్ ప్రారంభమై దాదాపు మూడేళ్ళయినా, అది గౌతమ్ మీనన్ లేటో, మన అమ్మడు మేఘ ఆకాష్ అడుగుపెట్టిన టైమో  సినిమా మాత్రం ఇంకా విడుదల కావడం లేదు.. మన తెలుగు లో హీరో నితిన్ తో చేసిన రెండు సినిమాల కోసం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.. ఆ రెండిట్లలో నటన పరంగా, గ్లామర్ పరంగా మేఘ మార్కులు కొట్టేసినా, బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్టు కొట్టలేక పోయాయి.. 
 
సాధారణంగా ఇలా ప్లాప్ లు వస్తే హీరోయిన్ ని తీసుకోడానికి సందేహిస్తారు.. కానీ మన మేఘ ఆకాష్ పరిస్థితి అలా కాదు, తంతే బూరుల బుట్ట లో పడట్టు, ఏకంగా సూపర్ స్టార్ పక్కనే  ''పెట్ట''లో నటించే ఛాన్స్ కొట్టేసింది, అది కాక బాలీవుడ్ లో కూడా ఆదిత్య పంచోలీ పక్కన నటించే అవకాశం దొరికింది.. ఇది ఇలా ఉంటే ఈ అమ్మడు అదృష్టం వెనుక దాగున్న రహస్యం ఏంటో అని చాలా మంది చెవులు కోరుకుంటున్నారు.. ఏ.టి.ఎం లైన్ ల లో గంటలు గంటలు నుంచుంటేనే నోట్లు దొరకని దురదృష్టం లో జనాలు ఉంటే, ప్లాప్ లో కూడా పెద్ద హీరో ల పక్కన నటించే అవకాశాలు కొట్టేస్తున్న ఈ హీరోయిన్ లక్కు మాములుది అయితే కాదు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.