అవకాశాలతో దూసుకుపోతున్న తెలుగు హీరోయిన్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

tollywood
Updated:  2018-07-30 11:22:55

అవకాశాలతో దూసుకుపోతున్న తెలుగు హీరోయిన్

"అంతకు ముందు ఆ తరువాత" "అమీతుమీ" "అ!" సినిమాల తో హీరోయిన్ గా తనని తానూ నిరూపించుకుంది ఈశ రెబ్బ.  ప్రస్తుతం ఈశ రెబ్బ చేతి నిండా సినిమాలు ఉన్నాయి. ఈశ రెబ్బ లేటెస్ట్ సినిమా అయిన "బ్రాండ్ బాబు" ఆగష్టు 3 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుంది. ఈ సినిమాతో శైలేంద్ర బాబు హీరోగా పరిచయం అవుతున్నాడు.

ఈ సినిమా తో పాటు ప్రస్తుతం ఈషా రెబ్బ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న "అరవింద సమేత"లో అలాగే హీరో సుమంత్ మూవీస్ లో నటిస్తుంది. అయితే లేటెస్ట్ న్యూస్ మేరకు ఈశ రెబ్బ నాగ శౌర్య సరసన ఒక మూవీ చేయడానికి ఓకే చెప్పిన్నట్టు తెలుస్తుంది.

తేజ అనే కొత్త కుర్రాడి దర్శకత్వంలో నాగ శౌర్య ఒక సినిమా చేస్తున్నాడు ఈ సినిమాని ఆనంద్ ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమా కోసం ఈశ రెబ్బ ని హీరోయిన్ గా ఫైనల్ చేసాడు అంట నాగ శౌర్య. మొత్తానికి తెలుగు హీరోయిన్స్ కి అవకాశాలు రావు అనే వాళ్ళు నోరు ముసుకునేలా అవకాశాలు తెచ్చుకొని కెరీర్ లో దూసుకుపోతుంది ఈశ రెబ్బ.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.