మురగదాస్ వారికి వార్నింగ్ ఇచ్చాడట...

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

muragadoss
Updated:  2018-10-06 12:24:49

మురగదాస్ వారికి వార్నింగ్ ఇచ్చాడట...

మురగదాస్ తమిళ్ డైరెక్టర్ ఏ అయినా మిగతా తమిళ్ దర్శకులతో పోలిస్తే ,తెలుగువారికి పరిచయం ఉన్న పేరు. స్పైడర్ మినహాయిస్తే, మురగదాస్ తెలుగు లోకి డబ్ చేసినా, తెలుగు కి అందించిన కథలు అన్ని హిట్ టాక్ సొంతం చేసుకున్నవే.. అయితే ప్రస్తుతం ఈ దర్శకుడు విజయ్ తో సర్కార్ అనే సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమాని తమిళ్ లో అత్యంత ప్రతిష్ఠాత్మక బ్యానర్ సన్ పిక్చర్స్  పతాకం ద్వారా కళానిది మారన్ భారీ వ్యయంతో తెరకెక్కిస్తున్నారు..

ఆస్కార్ విన్నింగ్ సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ మెర్సల్ తరువాత విజయ్ చిత్రానికి మరోసారి సంగీతం అందిస్తున్నారు.అయితే చూడటానికి చాలా సింపుల్ గా కూల్  గా కనిపించే ఈ జీనియస్ తన టీమ్ కే వార్నింగ్ ఇవ్వడం ప్రస్తుతం తమిళ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అసలు మురుగదాస్ తన టీమ్ కి ఎందుకు వార్నింగ్ ఇచ్చారు..? అని గుసగుసలు వినిపిస్తున్నాయి.. ఈ సినిమా నవంబర్ 6న విడుదలకు సిద్ధమవుతున్నది.

ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా తన అనుమతి లేకుండా ఎవరైనా మీడియాకు ఇంటర్య్వూలు ఇవ్వరాదని టీమ్ సభ్యులకు మురుగదాస్ వార్నింగ్ ఇస్తూ ట్విట్టర్ లో ఓ పోస్ట్ చేశారు.. ఇప్పటికే అడపాదడపా ఆర్టిస్ట్ లు వేరే సినిమా ప్రమోషన్ నిమిత్తం వెళ్లిన ఇంటర్వ్యూ లో ఈ సినిమా కోసం ప్రస్తావన వచ్చిందట.. ఈ చిత్ర టీం ద్వారా ఏదైనా లీక్ అయితే మళ్ళీ ఇబ్బంది అని గ్రహించిన మురగదాస్ జాగ్రత్త కోసం అలా వార్నింగ్ ఇచ్చాడని తెలుస్తుంది.. ఇక సినిమా విషయానికి వస్తే తమిళంలో సమకాలీన రాజకీయాంశాల నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రమిది..

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.