సుమంత్ హీరోయిన్ తో నాగ్ రోమాన్స్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

nagarjuna image
Updated:  2018-04-15 11:17:41

సుమంత్ హీరోయిన్ తో నాగ్ రోమాన్స్

తెలుగు చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో ప‌రిచ‌యాలు  అక్క‌ర్లేని వ్య‌క్తుల‌లో ఒక్క‌రు అక్కినేని  నాగార్జున‌... నాటి నుంచి నేటి వ‌ర‌కూ తెలుగు ఇండ‌స్ట్రీలో అనేక చిత్రాల‌కు హీరోగా న‌టించి త‌నంటూ ఒక ప్ర‌త్యేక‌మైన గుర్తింపు తెచ్చుకున్నారు కింగ్...  ఇక   రీసెంట్ గా ఆయ‌న న‌టించిన చిత్రం రాజుగారి గ‌ది2.. ఈ సినిమా కూడా మంచి విజ‌యం సాధించింది... ఈ చిత్రానికి ఓమ్ కార్ ద‌ర్శ‌క‌త్వం  వ‌హించాడు.
 
ఇక తాజాగా కింగ్‌ నాగార్జున, నేచురల్‌ స్టార్‌ నాని హీరోలుగా భారీ మల్టీస్టారర్ సినిమాను తెర‌కెక్కుతోంది... వైజయంతి మూవీస్‌ పతాకంపై తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి టి.శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వ‌హించారు..  అయితే ఇప్ప‌టికే ఈ  సినిమాకు సంబంధించి రెగ్యులర్‌ షూటింగ్‌ మార్చి 18 ఉగాది రోజు నుంచి ప్రారంభమైయింది.
 
ఈ సినిమాలో నాగార్జున సరసన ఆకాంక్ష సింగ్‌ నటించనున్నట్లు చిత్ర యూనిట్ శనివారం ప్రకటించింది. మరోపక్క నానికి జోడీగా రష్మికా మంధాన కనిపించనున్నట్లు సమాచారం. ఆకాంక్ష ‘మళ్లీరావా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కథానాయికగా పరిచయం అయింది. సుమంత్‌ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం గత ఏడాది చివర్లో విడుదలైన సంగ‌తి తెలిసిందే.
 

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.