పవన్ కళ్యాణ్ పై కామెంట్స్ చేసిన నాగ చైతన్య.

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-09-14 13:15:38

పవన్ కళ్యాణ్ పై కామెంట్స్ చేసిన నాగ చైతన్య.

ఎప్పుడూ లేనిది ఈ మధ్య నాగచైతన్య కూడా సోషల్ మీడియాలో అక్టీవ్ గా ఉండటం మొదలు పెట్టాడు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో అక్కినేని అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఎంతో ఓపికగా తెలివిగా సమాధానం చెప్పాడు. 
 
కొంత మంది ఇతర హీరోల ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు దాటవెయ్యకుండా వారి గురించి చాల పోసిటివేగా సమాధానం చెప్పాడు. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం స్పూర్తిదాయకం అంటూ ఎవరైనా పవన్ వ్యక్తిత్వాన్ని చూసి స్ఫూర్తి పొందడం  మాములే. మహేష్ బాబు ఒక నిజమైన సూపర్ స్టార్ అంటూ పొగిడాడు.
 
ఇక రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ.... ప్రతి సినిమాకి బెటర్ అవుతూ వస్తున్న అతని కృషి తనకు ఆదర్శం అంటూ చెప్పుకొచ్చాడు.  అయితే తాను హీరో అజిత్ వీరాభిమానిని అని చెపుతున్నాడు.జూనియర్ ఎన్టీఆర్ ఎంచుకునే పాత్రలు తనకు ఎంతో ఇష్టమని చెబుతూ తన తమ్ముడు అఖిల్ తన జీవితంలో ఒక భాగమంటూనే రానా తన లైఫ్ సపోర్ట్ పిల్లర్ గా పెర్కొన్నాడు. ఇలా అందరిని డిప్లొమాటిక్ గా పొగుడుతూ తన సినిమాని చూడమని చెప్పకనే చెప్పాడు. చూడబోతే ఈ బుల్లోడు  ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమా మీద చాలా అశలు పెట్టుకున్నట్టు ఉన్నాడు.

షేర్ :