సమంతా తో ఇబ్బంది పడుతున్న నాగ చైతన్య

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

samantha and chaitu
Updated:  2018-10-31 01:07:00

సమంతా తో ఇబ్బంది పడుతున్న నాగ చైతన్య

రీల్ లైఫ్ లో మాత్రమే కాకుండా రియల్ లైఫ్ లో కూడా ప్రేమించుకొని, పెళ్లి చేసుకున్న జంట నాగచైతన్య-సమంత. వీరిద్దరూ కలిసి జోడి కట్టిన తొలి సినిమా ఏమాయచేసావే లోనే ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటారు.ఆ తరువాత ఆటోనగర్ సూర్య, మనం లాంటి సినిమా లలో కలిసి నటించారు. అయితే గత ఏడాది ఇరు కుటుంబాల సమ్మతి తో ఘనంగా పెళ్లి చేసుకుని ఒకటయ్యారు ఈ జంట.

అయితే తాజాగా నాగ చైతన్య నటించిన సవ్యసాచి సినిమా విడుదల కి సిద్ధమైన నేపథ్యంలో సవ్యసాచి ప్రమోషన్ లో భాగంగా చైతూ, రానా హోస్ట్ గా వ్యవహరిస్తున్న నెంబర్ వన్ యారీరే కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఆ షో లో భాగంగా రానా, చైతన్య ని ఇబ్బంది పడే ప్రశ్నలే వేసాడు. అందులో ఒకటి సమంత ని పెళ్ళి చేసుకొని బాధపడుతున్నావా..? నిన్నేమైనా ఇబ్బంది పెడుతుందా..? అంటూ అక్కినేని నాగచైతన్య ని ప్రశ్నించాడు రానా దగ్గుబాటి .

దానికి నాగచైతన్య సమాధానంగా ఇలాంటి ప్రశ్నలు వేసి ఇబ్బంది పెట్టకురా బాబు అంటూ అన్యమనస్కంగానే నవ్వాడు చైతన్య. ఈ కార్యక్రమం వచ్చే ఆదివారం ప్రసారం కానుంది. రానా-నాగచైతన్య ఇద్దరు కూడా బావా-బావ మరుదులు అన్న విషయం తెలిసిందే. నాగచైతన్య రానా కు మేనత్త కొడుకు . దాంతో చిన్నప్పటి నుండి రానా – నాగచైతన్య కలిసే పెరిగారు. ఆ చనువు తోనే కవ్వించడానికి ఈ ప్రశ్న అడిగాడు రానా. ఇక చైతూ నటించిన సవ్యసాచి నవంబర్ 2 న ప్రేక్షకుల ముందుకి రాబోతుంది