ఆ రెండు నాకస్సలు నచ్చవంటున్న నాగ చైతన్య

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-09-14 12:04:35

ఆ రెండు నాకస్సలు నచ్చవంటున్న నాగ చైతన్య

ప్రతి హీరో కెరీర్ లోను ఎత్తుపల్లాలు సర్వసాధారణం. కొన్ని సినిమాలు అందలం ఎక్కిస్తే కొన్ని పాతాళం లోకి తొక్కేస్తాయ్. నాగచైతన్య దీనికి మినహాయింపు కాదు. అతని కెరీర్లోనూ మచ్చలున్నాయి. దడ, ‘బెజవాడ’ ఈ రెండు చిత్రాలు అతని కెరీర్లో అతి పెద్ద డిజాస్టర్లు గా పరిగణించవచ్చు.
 
నా కెరీర్ లో ఎన్నో చిత్రాలు చేశాను, అన్నీ హిట్ కాలేదు కానీ దఢ , బెజవాడ చిత్రాలు మాత్రం నన్ను చాలా బాధపెట్టాయి అని అంటున్నాడు అక్కినేని నాగచైతన్య. అసలు ఆ చిత్రాలు ఎలా ఒప్పుకున్నానో ? తెలియడం లేదు. బహుశా మొహమాటం కొద్దీ ఒప్పుకున్నానేమో. ఇక ముందు మాత్రం అలాంటి సినిమాలు అస్సలు చేయనని, ఇప్పటినుండి కథల విషయంలో జాగ్రత్త పడతానని అలాగే ప్రేమమ్ చిత్రం నా కెరీర్ లొనే మరిచిపోలేని చిత్రం అని నాగచైతన్య చెప్తున్నాడు.
 
ఈ అక్కినేని వారసుడు నటించిన శైలజారెడ్డి అల్లుడు విడుదలైన సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పై విషయాలన్నీ పంచుకున్నారు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన శైలజారెడ్డి అల్లుడు పై నాగచైతన్య చాలా ఆశలు పెట్టుకున్నట్టే కనిపిస్తున్నాడు.. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన శైలజారెడ్డి అల్లుడు లో రమ్యకృష్ణ అత్తగా నటించగా అను ఇమ్మనుయెల్ చైతూ సరసన నటించింది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.