రీషూట్ గురించి మాట్లాడిన నాగ చైతన్య

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

hero naga chaitanya
Updated:  2018-11-02 05:25:37

రీషూట్ గురించి మాట్లాడిన నాగ చైతన్య

సాధారణం గా సినిమా అంతా రిలీజ్ అయ్యి, ఇక్కడ హీరో యాక్టింగ్ బాలేదు. ఈ సీన్ లో ఇది మిస్ అయింది అనుకోవడం కన్నా సినిమా రిలీజ్ కాకుండానే రషెస్ చూసి, కరెక్ట్ చేసుకోవడానికి రీషూట్ చేస్కోవడం మంచిది అంటున్నాడు అక్కినేని నాగ చైతన్య. ఒకప్పుడు రీషూట్ అంటేనే సినిమాలో ఎదో తప్పు దొర్లింది కాబట్టి మళ్ళీ షూట్ కి వెళ్తున్నారు, ఈ సినిమా బాగోదు అని ఫిక్స్ అయ్యేవారు.

కానీ ఆ అభిప్రాయాన్ని, సెంటిమెంట్ ని పూర్తి గా మార్చేసింది మాత్రం కింగ్ అక్కినేని నాగార్జున ఏ. ఆ వరవడి ని కొనసాగిస్తూ, నాగ చైతన్య కూడా అలాగే ఆలోచిస్తున్నాడు. ఏం చేసినా ఫైనల్ ఔట్ ఫుట్ ముఖ్యం. దానికి మళ్ళీ రీషూట్ చేస్తే తప్పేంటి అని ప్రశ్నిస్తున్నాడు. సవ్యసాచి సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియా ముందుకు వచ్చిన చై కి రీషూట్ పై ప్రశ్న రాగా దాంట్లో తప్పుంది అని తను భావించట్లేదు అని చెప్పోకొచ్చాడు ఈ అక్కినేని అందగాడు.

సినిమాల్లో అందరూ చేసేదే, దాన్ని తప్పుగా చూడొద్దు అంటూ చెప్పాడు. ఇక చివరిగా  శైలజారెడ్డి అల్లుడు కోసం అడగగా సినిమా తో తాను తృప్తి చెందాను అని, తన కెరీర్ లో రికార్డు స్థాయి ఓపెనింగ్స్ తీస్కొచింది అని చెప్పాడు. అయితే ఆ చిత్రం అందర్నీ అంత ఆకట్టుకోలేకపోయింది అని విచారం వ్యక్తం చేశాడు చైతన్య.

షేర్ :