ఒక్క హిట్ తోనే నాగ శౌర్యకి పొగరు ఎక్కింద?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

naga shourya hero
Updated:  2018-08-10 04:42:34

ఒక్క హిట్ తోనే నాగ శౌర్యకి పొగరు ఎక్కింద?

నాగ శౌర్య కెరీర్ లోనే అతిపెద్ద హిట్ గా నిలిచిన సినిమా "ఛలో". వెంకీ కుడుముల డైరెక్ట్ చేసిన ఈ సినిమా మంచి కమర్షియల్ హిట్ ని అందుకుంది. కానీ ఈ సినిమా తరువాత నాగ శౌర్య తీసిన సినిమాలు ఏవి పెద్దగా సక్సెస్ కాలేదు.

ఆ మధ్యలో సాయి పల్లవితో "కణం" అనే సినిమాలో నటించిన కూడా ఆ సినిమాలో ప్రాధాన్యం లేని పాత్రలో నటించాడు శౌర్య. అలాగే శౌర్య ఎంతో ఇష్టపడి చేసిన "అమ్మమ్మగారిల్లు" కూడా ఆడలేదు. ఆ సినిమా షేర్ రూ.3 కోట్లకు మించలేదు. అలాంటప్పుడు నాగ శౌర్య లేటెస్ట్ సినిమా అయిన "నర్తనశాల" మీద ఏకంగా రూ.15 కోట్లు పెట్టేయడం చాలా పెద్ద రిస్క్.

కేవలం ఒక్క హిట్ తోనే నాగ శౌర్య ఎందుకు ఈ రేంజ్ ఓవర్ చేస్తున్నాడు అని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ సినిమాకి ఎంత పాజిటివ్ టాక్ వచ్చినా కూడా సినిమా ఆ రేంజ్ లో వసూలు చేయలేదు. పైగా అప్పుడే నాగ చైతన్య హీరోగా చేస్తున్న "శైలజా రెడ్డి అల్లుడు" కూడా రిలీజ్ కి రెడీ గా ఉంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.