గే పాత్ర నుంచి బయటకి వచ్చి "నారి నారి నడుమ మురారి" అంటున్న నాగ శౌర్య

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

naga sourya
Updated:  2018-08-22 02:10:59

గే పాత్ర నుంచి బయటకి వచ్చి "నారి నారి నడుమ మురారి" అంటున్న నాగ శౌర్య

యంగ్ హీరో నాగ శౌర్య ఈ ఏడాది "ఛలో" సినిమాతో హిట్ ని అందుకున్నాడు. ఈ సినిమా తరువాత మళ్ళి తన సొంత ప్రొడక్షన్ హౌస్ లోనే "నర్తనశాల" అనే సినిమా చేస్తున్నాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగష్టు 30 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుంది. ఈ సినిమాలో నాగ శౌర్య గే పాత్రలో నటిస్తున్నాడు అని టిజర్ చూస్తే అర్ధం అవుతుంది.

ఈ సినిమా ఇంకా రిలీజ్ కాకముందే అప్పుడే తన తదుపరి సినిమా పనుల్లో బిజీ అయిపోయాడు శౌర్య. భవ్య క్రియేషన్స్ వారు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాని తేజ అనే కొత్త కుర్రాడు డైరెక్ట్ చేస్తున్నాడు. తేజ ఇది వరకు శేఖర్ కమ్ముల దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసాడు. అయితే ఈ సినిమాకి "నారి నారి నడుమ మురారి" అనే టైటిల్ పెట్టె ఆలోచనలో మూవీ యూనిట్ ఉన్నట్టు తెలుస్తుంది.

ఈ సినిమాలో గణపతి అనే ఒక స్టూడెంట్ క్యారెక్టర్ నాగ శౌర్య కనిపించబోతున్నాడు. అయితే మొదట ఈ సినిమాని "గణ" అనే వర్కింగ్ టైటిల్ ని అనుకున్నారు మూవీ యూనిట్. 

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.