నేను మల్టి స్టారర్ చెయ్యను

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

naga sourya
Updated:  2018-08-29 06:04:11

నేను మల్టి స్టారర్ చెయ్యను

ఉన్నది ఉన్నట్టు మాట్లాడే హీరోల్లో నాగశౌర్య ఒకరు. ఇటీవల ఆయన నటించిన పాత్రలన్నీ ఆయనకు మంచిపేరు సంపాదించి పెడుతున్నాయి. ఈ నెలాఖరున ఆయన నటించిన "@నర్తనశాల" విడుదల కానుంది.ఈ సినిమా కి శ్రీనివాస్ చక్రవర్తి దర్శకత్వం వహించారు. ఈ సందర్బంగా ఆయన్ని కొన్ని ప్రశ్నలు అడగ్గా ఆయన అన్నింటికి ఓపిగ్గా సమాధానం ఇచ్చారు.
 
సాధారణంగా పెద్ద పెద్ద హీరోలంతా మల్టీస్టారర్ మూవీ గురించి అడగ్గానే “మంచి కథ కుదిరితే చేస్తాను, నాకేం అభ్యంతరాలు లేవు” అనే మాటలే వినబడతాయి. కానీ వీటికి బిన్నంగా ఈమధ్యే పెరు తెచ్చుకున్న నాగశౌర్య మాత్రం తాను మల్టి స్టారర్ కి దూరంగా ఉంటాను అంటున్నాడు. మొన్నామధ్య నారా రోహిత్ తో కలిసి “జ్యో అచ్యుతానంద” తీసి మంచి మార్కులు కొట్టేశారుగా అని ప్రశ్నించగా  “ రోహిత్ తో ఉన్న మంచి రిలేషన్ వల్లనే అది సాధ్యపడింది.” అంటూ చెప్పుకొచ్చాడు ఈ కుర్ర హీరో.
 
కెరీర్ లో మంచి ఊపుమీద ఉన్న ఈ యువ హీరో తన తరువాతి సినమాని రమణ అనే ఒక  కొత్త దర్శకుడి చేతిలో పెట్టనున్నాడు. వెంకటేష్, పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు లాంటి అగ్ర కథానాయకులే చేస్తున్నారు ఇతనికేం అయ్యింది అంటూ పెదవి విరుస్తున్నారు సినీ వర్గాల వారు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.