ఫ్యాన్స్ ఉండే వారిలో రామ్ చరణ్ చివరి వాడు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

ram charan and naga sourya
Updated:  2018-08-25 03:26:28

ఫ్యాన్స్ ఉండే వారిలో రామ్ చరణ్ చివరి వాడు

అతి తక్కువగా మాట్లాడే యువహీరోల్లో నాగ శౌర్య ముందుంటాడు. మాట్లాడేవి నాలుగు ముక్కలే అయినా గుండెల నుండి వస్తాయి మన కుర్ర హీరోకి. మొన్న జరిగిన ఇంటర్వ్యూ లో అతను సినీహీరోలు వారి యొక్క ఖ్యాతి గురించి మాట్లాడినప్పుడు కూడా మళ్ళి ఇదే నిరూపణ అయ్యింది.

స్టార్డమ్ గురించి యాంకర్ వేసిన ప్రశ్నకు బదులిస్తూ హీరోలకు అభిమానులు, అభిమాన సంఘాలు ఉండే చివరి హీరో ఒక్క రామ్ చరణ్ మాత్రమే అంటూ చెప్పుకొచ్చాడు నాగ శౌర్య. "ఆ  రోజుల్లో హీరోలు బయట ఎక్కువగా తిరిగేవారు కాదు, అభిమానులు కూడా సినిమా షూటింగ్ స్పాట్స్ లోను, హీరోల ఇంటి దగ్గరా పడిగాపులుకాసి మరి తమతమ అభిమానహీరోలను కలుసుకునేవారు. హీరోలను దేవుళ్లుగా కొలిచేవారు. దానివల్లే వారికి అంత ఖ్యాతి లభించింది.

కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. షూటింగులంటూ, ప్రమోషన్లు అంటూ మేము జనాల్లోనే ఎక్కువగా ఉంటున్నాం కాబట్టి వారికీ మేము కనిపించిన ప్రతిసారి అదే అనుభూతి ఉండకపోవచ్చు. ఈరోజుల్లో కూడా ఒకవేళ ఎవరన్నా మాకు ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు అనిచెప్పుకుంటే అది నేను నమ్మను." అంటూ క్లారిటీ ఇచ్చేశాడు మన హీరోగారు. ఇదిలా ఉంటే నాగ శౌర్య హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా అయిన "నర్తనశాల" ఈ నెల 30 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.