బ్యాక్ టు బాలీవుడ్ అంటున్న నాగార్జున

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

nagarjuna akkineni
Updated:  2018-07-10 03:40:41

బ్యాక్ టు బాలీవుడ్ అంటున్న నాగార్జున

మన తెలుగు హీరోలు చాలా మంది బాలీవుడ్ లో సినిమాలు చేయడానికి ట్రై చేసి చేతులు కాల్చుకున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లాగే ఈ తరం హీరోలు అయిన రానా, రామ్ చరణ్, సుధీర్ బాబు కూడా అలాగే చేసారు. కాని తెలుగు నుంచి ఒక్క హీరో అంటే మాత్రం బాలీవుడ్ ప్రేక్షకులకి చాలా ఇష్టం. ఆ హీరో నే మన అక్కినేని నాగార్జున.
 
నాగార్జున కి బాలీవుడ్ లో మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి. అక్కడ ఆల్రెడీ కొన్ని సినిమాలు చేసి వచ్చాడు నాగార్జున. కాని మళ్ళి కొన్నేళ్ళ పాటు బాలీవుడ్ సినిమాలకి దూరంగా ఉన్నాడు నాగార్జున. అయితే మళ్ళి దాదాపు 15 ఏళ్ల తర్వాత నాగార్జున ఓ బాలీవుడ్ సినిమా సైన్ చేశాడు. రణబీర్ కపూర్, అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న "బ్రహ్మాస్త్ర" అనే భారీ బడ్జెట్ సినిమాలో నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నాడు.
 
అక్కినేని నాగార్జున నేటి నుంచి ముంబైలో జరిగే షూటింగ్ లో జాయిన్ అవ్వనున్నాడు. ఈ సినిమాలో నాగార్జున రోల్ ఏంటి అసలు ఏ క్యారెక్టర్ పోషిస్తున్నాడు అనే విషయం పై ఇంకా క్లారిటీ లేదు. నాగార్జున ఇటివలే నటించిన "ఆఫీసర్" సినిమా బాలీవుడ్ లో కూడా రిలీజ్ అవ్వాలి, కాని మూవీ ఫ్లాప్ అయినందుకు ఆ సినిమాని అక్కడ రిలీజ్ చేయలేదు నిర్మాతలు.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.