తండ్రి బయోపిక్ మీద క్లారిటీ ఇచ్చిన నాగార్జున

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

nagarjuna and nageswara rao
Updated:  2018-09-24 13:34:09

తండ్రి బయోపిక్ మీద క్లారిటీ ఇచ్చిన నాగార్జున

బాలీవుడ్ లో ఒకప్పుడు బయోపిక్ లు దుమ్ము దులిపేశాయి. ఇప్పుడు అదే ట్రెండ్ టాలీవుడ్ లో కూడా నడుస్తుంది. ఇప్పటికే తెలుగులో బయోపిక్ లు ఊపందుకున్నాయి. మహానటి ఘనవిజయం అందుకు ఒక కారణం అని చెప్పొచ్చు.  ఇప్పుడు చిరంజీవి కూడా అదే బాటలో స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాధను తెరేకెక్కిస్తున్నారు.

మరోపక్క నందమూరి బాలకృష్ణ తన తండ్రి నందమూరి తారక రామారావుని తెరమీదకీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక మమ్ముట్టి ని పెట్టి  “యాత్ర” పేరుతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అయిన విధానాన్ని చూపించనున్నారు. అలాగే - కత్తి కాంతారావు - కొండ మురళి ఇంకా పలువురి బయోపిక్ లు వస్తున్న విషయం తెల్సిందే.ఇప్పుడు అక్కినేని నాగేశ్వరరావు బయోపిక్ మీద చర్చనడుస్తుంది. సామాజిక మధ్యమాలలో ఇప్పటికే చాలాసార్లు ఈ ప్రస్తావన వచ్చినప్పటికీ నాగార్జున దాన్ని కొట్టిపదేశారు.

తాజాగా ఏయన్నార్ బయోపిక్ పై ఫుల్ క్లారిటీని అక్కినేని నాగార్జున ఇవ్వడం జరిగింది. నాన్న గారి జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తీయాలనే ఆలోచన తనకు లేదని మరెవ్వరైనా ఆ ఆలోచనతో వచ్చినా కూడా తాము ఆసక్తి చూపించడం లేదంటూ నాగార్జున చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం బయోపిక్ లు తెరకెక్కుతున్న వ్యక్తులకు ఏయన్నార్ గారి జీవితానికి చాలా వ్యత్యాసం ఉంటుందని నాగార్జున అన్నాడు.నాన్నగారి జీవితం చాలా సాఫీగా సాగిపోయింది. అందులో సినిమాకి స్కోప్. లేదంటూ తేల్చి చెప్పేసాడు. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.