నాగ్ కోపానికి బలైన ఆ దర్శకుడు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

nagarjuna
Updated:  2018-09-28 11:01:59

నాగ్ కోపానికి బలైన ఆ దర్శకుడు

అక్కినేని నాగార్జునకి జయాపజయాలు కొత్తేమి కాదు. ఆయన తన జీవితంలో ఇండస్ట్రీ హిట్లు చూశాడు, ఘోరమైన అట్టర్ ప్లాపులు చూశాడు. చై కెరీర్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇప్పడు మంచి నటుడిగా కొనసాగుతున్నాడు. తన సినిమా విషయానికి వస్తే కథ నుంచి సినిమా ఫస్ట్ కాపీ వరకు జాగ్రత్తగా చూసుకొని అప్పటికి ఏవైనా మార్పులు అవసరం అయితే అప్పుడు డైరెక్టర్ కి మార్పులు చేర్పులు చెప్పి అవసరం అయితే రీషూట్ చేయించి అప్పుడు విడుదల చేస్తాడు.

ఆయనే కాదు చిరు కూడా అంతే. మెగా ఫ్యామిలీ హీరోలా విషయంలో చాలా కేర్ తీసుకుంటూ ఉంటాడు మెగాస్టార్. అందువల్లే ఆయా హీరోలు ఇప్పటికి ఇండస్ట్రీలో చలామణి అవుతున్నారు.నిన్న రిలీజ్ అయిన ‘దేవదాసు’ ఫస్ట్ కాపీని నాగ్ కి తెలియకుండానే ఫిక్స్ చేశారట దర్శకనిర్మాతలు. సినిమా రిలీజ్ కి రెండు రోజుల ముందు “దేవదాస్” ని చూసిన నాగార్జున సీన్స్ విషయం లో కొన్ని మార్పులు చేయాలి అని భావించాడట, కానీ అప్పటికే మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యి ఉండటంతో ఎం చెయ్యలేని పరిస్థితి..ఈ విషయం లో డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య కి ఒక రేంజ్ లో క్లాస్ పీకాడట నాగార్జున.

ఇక మీదట ఎప్పుడు ఇలా చెయ్యకు… ఇండస్ట్రీలో ఉన్నప్పుడు పెద్దల మాట సినిమాకి ఎంతో అవసరం అని శ్రీరామ్ ఆదిత్య కి చెప్పాడట నాగార్జున.అంటే ఓవరాల్ ఔట్పుట్ మీద నాగ్ కాన్ఫిడెంట్ గా లేడని తెలుస్తుంది. సినిమా కూడా అంతేమి లేదని నిన్నటి షోలు చెప్పకనే చెప్పేశాయి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.