మామయ్య నాకు లైఫ్ లో మర్చిపోలేని గిఫ్ట్ ని ఇచ్చాడు - సమంతా

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

samantha and nagarjuna
Updated:  2018-07-24 05:31:22

మామయ్య నాకు లైఫ్ లో మర్చిపోలేని గిఫ్ట్ ని ఇచ్చాడు - సమంతా

అక్కినేని నాగ చైతన్య ఇంకా సమంతా ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకొని ఇప్పుడు హ్యాపీగా ఎవరికీ వారు సినిమాలు చేస్తూ కాపురం చేసుకుంటున్నారు. సమంతా నాగార్జున కి కోడలే అయిన కూడా నాగార్జునని మొన్నటి వరకు కూడా సర్ అనే పిలిచింది సమంతా. అయితే సమంతా కి నాగార్జున మాత్రం ఒక లైఫ్ టైం కి సరిపడే గిఫ్ట్ ని ఇచ్చాడు అట.
 
నాగచైతన్యకి భార్యగా తనను అంగీకరించడమే తనకు మామ ఇచ్చిన పెద్ద గిఫ్ట్ అని సమంతా అంటుంది. ఆయన ఎప్పుడు కలిసి నాతో ఒక కూతురి లాగ మాట్లాడుతూ కెరీర్ గురించి సలహాలు ఇస్తాడు అని కూడా చెప్పుకొచ్చింది సమంతా. ఇదిలా ఉంటె నాగ చైతన్య ఇంకా సమంతా జంటగా నటిస్తున్న సినిమా స్టార్ట్ అయ్యింది, శివ నిర్వాణ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడులాగే "యూటర్న్" సినిమాలో జర్నలిస్ట్ రచన పాత్రలో నటిస్తున్నాను. ఈ సినిమాలో నాకు ముక్కుపుడక ఉంటుంది.
 
అయితే అది మీరన్నట్లు నిజంగా కుట్టించుకోలేదు. దర్శకుడు పవన్ కుమార్ కి గల ప్రతిభ కారణంగానే ఈ సినిమాని ఒప్పుకున్నాను. తెలుగు,తమిళ భాషల్లో నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకున్నాను అని తన సినిమాలు విషయాలు కూడా చెప్పింది సమంతా.
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.