బిగ్ బాస్ ఫైనల్ కి చీఫ్ గెస్ట్ గా నాగార్జున ?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

nagarjuna and bigg boss 2
Updated:  2018-09-12 05:25:41

బిగ్ బాస్ ఫైనల్ కి చీఫ్ గెస్ట్ గా నాగార్జున ?

చివరి దశకు చేరుకున్న బిగ్ బాస్ టీవీ షో లో ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. హౌస్ లో అందరూ ఎలిమినతె అవుతూ వచ్చారు. ఇప్పుడు కొందరు మాత్రమే ఉన్నారు. వారిలో విన్నర్ ఎవరో రన్నర్ ఎవరో లూజర్స్  ఎవరో తెలియలాంటర్ ఇంకొన్ని రోజులు వేచి చూడక తప్పదు. ఇప్పటికే కొన్ని రోజులనుండి టి ఆర్ పి రేటింగ్ లు మళ్ళీ ఊపందుకున్నాయని వినికిడి.

బిగ్ బాస్ టీమ్ విన్నర్ ని ప్రకటించే గ్రాండ్ ఫినాలే కి ఒక సెలబ్రిటీ ని తెస్తే బాగుంటుందని ఆలోచన లో పడింది. అనుకున్నదే ఆలస్యం వాళ్ళకి నాగ్ గుర్తొచ్చేసాడు. ఇంకేముంది ఆహ్వానం పంపెయ్యడం ఆయన సుముఖత వ్యక్తం చేయడం అన్ని జరిగిపోయాయి. ఇక విన్నర్ విషయానికి వస్తే దాదాపు విన్నర్ కూడా ఖరారు అయిపోయినట్లే.

కౌశల్ ఆర్మీ ఎట్టి పరిస్థితుల్లోనూ టైటిల్ ను వేరే వాళ్ళకి పోనివ్వదు. దానివల్ల కొంచెం క్యూరసిటీ కి భంగం కలిగినా ‘ఇది బిగ్ బాస్ ఏమైనా జరగొచ్చు’ అంటూ నాని చెప్పే విధానం ఒక్కోసారి అనుమానాలు రేకేత్తిస్తుంది.నాని నాగార్జున కలిసి ‘దేవదాస్’ మల్టీస్టారర్ చిత్రంలో నటించారు. ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నెల 27వ తరీఖున విడుదల చేయనున్నట్లు అధికారికంగా తెలిపారు.

షేర్ :