స్టార్ హీరో దర్శకత్వంలో నాగార్జున

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-08-03 04:45:11

స్టార్ హీరో దర్శకత్వంలో నాగార్జున

అక్కినేని నాగార్జున ప్రస్తుతం తెలుగు లో నానితో కలిసి "దేవదాస్" అనే మల్టీ స్టారర్ మూవీ లో నటిస్తున్నాడు. "భలే మంచి రోజు" ఫేం అయిన శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. అతి త్వరలో ఈ సినిమా యొక్క షూటింగ్ పూర్తికానుంది. ఈ సినిమా సెప్టెంబర్ 27 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

అయితే లేటెస్ట్ న్యూస్ ప్రకారం ధనుష్ దర్శకత్వంలో రూపొందబోయే సినిమా లో నాగార్జున హీరో గా నటించేందుకు ఓకే చేసాడు అంట. ఇటివలే ధనుస్ హైదరాబాద్ కి వచ్చి మరి నాగార్జునకి కథ చెప్పాడు అని టాక్. అయితే ఈ సినిమాని ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు, ధనుష్ కూడా ఈ సినిమాలో హీరోగా నటిస్తాడా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉంటే ఈ చిత్రం తో పాటు నాగ్ హిందీ లో అమితాబ్ బచ్చన్ , రన్బీర్ కపూర్ లతో కలిసి "బ్రహ్మస్త్ర" సినిమా లో నటిస్తున్నాడు. ఈ సినిమాకి సంభందించిన నాగార్జున షూటింగ్ పార్ట్ ఇటివలే పూర్తయింది. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.