నాగ చైతన్యను పక్కన పెట్టేసిన నాగ్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-09-15 12:02:20

నాగ చైతన్యను పక్కన పెట్టేసిన నాగ్

అక్కినేని వారి పెద్ద మనువడు నాగ చైతన్య నటించిన ‘శైలజా రెడ్డి అల్లుడు’ ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన సంగతి విదితమే. ఈ చిత్రం ఇప్పటికే కొంచెం మంచి టాక్ తెచ్చుకుని బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ లు కురుపించడం మొదలు పెట్టింది.  అయితే ఈ కథ ఎంపిక ఎవరిది? నాగార్జున హస్తం ఉందా? లేదా నాగ చైతన్య తనకి తానుగానే ఈ కథకి ఒప్పుకున్నాడా? అనేది ఇప్పుడు సిని వర్గాల్లో మెదులుతున్న ప్రశ్న.
 
ఇదే ప్రశ్న ను చైతు ని అడగ్గా ! అసలు నాన్నగారు నా స్క్రిప్ట్ ల్లో వేలు పెట్టడం మానేసి చాలా కాలమైంది అని అన్నాడు. ఎవరొకరు మన కథల్ని వినాల్సి ఉంటుంది. ఫ్రెండ్ఓ అన్నో, నాన్నో, ఇలా ఎవరోకరి సాయం ఖచ్చితంగా కావాలి. అల నా కెరీర్ మొదట్లో నాన్నగారు నా కథలు వినేవారు.
 
కాని ఇప్పుడు నాన్నగారు నా కథల ఎంపిక లో వేలు పెట్టడం లేదు. నా కథల్ని నేనే ఎంపిక చేసుకుంటున్నా.  దీన్నిబట్టి చైతు చెయ్యబోయే స్క్రిప్టుల్ని కింగ్ వినడం మానేసారన్నమాట.  అఖిల్ ఇంకా నిలదొక్కుకోలేదు కాబట్టి అతను తన కాళ్ళమీద నిలబడే వరకు నాగ్ ప్రమేయం ఖచ్చితం గా ఉంటుంది. ‘మిస్టర్ మజ్ను’ అనే టైటిల్ ని అఖిల్ మూడవ సినిమా టైటిల్ గా పరిగణలో ఉన్నట్లు తెలుస్తుంది.


 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.