షాకింగ్ కామెంట్స్ చేసిన నాగార్జున

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-08-03 03:35:12

షాకింగ్ కామెంట్స్ చేసిన నాగార్జున

అక్కినేని నాగార్జున ప్రస్తుతం తన అల్లుడు సుశాంత్ హీరో గా చేసిన "చి. ల. సౌ" సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. అయితే ఈ ప్రమోషన్స్ లో భాగంగా లేటెస్ట్ సెన్సేషన్ అయిన "RX 100" గురించి మాట్లాడాడు నాగార్జున. ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ "నేను ఈమధ్యనే "RX 100" సినిమాకి సంబందించిన ఆఖరి రెండు రీల్స్ మా స్టూడియోలో చూసాను.
 
నాకు సినిమా చాలా బాగా నచ్చింది అదే సమయంలో సినిమా రైటింగ్ కూడా చాలా బాగుంది. ఆ రెండు రీల్స్ చూసినప్పటి నుండి మొత్తం సినిమా చూడాలి అనే ఆసక్తి మొదలైంది. త్వరలోనే సినిమా చూస్తాను, అదే సమయంలో ఈ సినిమా పైన నెగటివ్ టాక్ కూడా విన్నాను. అయితే ఇది అడల్ట్ సినిమా అందుకే A రేటింగ్ ఇచ్చారు.
 
అలాంటప్పుడు నచ్చిన వాళ్ళు మాత్రమే ఈ సినిమా చూడాలి, నాకైతే బాగా నచ్చింది" అంటూ ఈ సినిమాని ఒక రేంజ్ లో మోసేసాడు నాగార్జున. మరి ఈ సినిమాని అడల్ట్ సినిమాగా పోల్చడం పట్ల ఈ సినిమా డైరెక్టర్ అయిన అజయ్ భూపతి ఎలా స్పందిస్తాడో చూడాలి. 
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.