నాగ చైతన్య కి అడ్డుగా మారిన నాగార్జున

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

Updated:  2018-07-07 18:49:43

నాగ చైతన్య కి అడ్డుగా మారిన నాగార్జున

అక్కినేని నాగ చైతన్య "యుద్ధం శరణం" లాంటి ఫ్లాప్ తరువాత నటిస్తున్న సినిమా "సవ్యసాచి". నాగ చైతన్య "ప్రేమం" వంటి క్లాస్ హిట్ ని అందించిన చందు మొండేటి ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ వారు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా అసలు ఎప్పుడో రిలీజ్ అవ్వాలి, కాని గ్రాఫిక్స్ వర్క్ కారణంగా ఈ సినిమా ఆగష్టు రెండో వారంకి పోస్ట్ పోన్‌ అయ్యింది.
 
అయితే ఈ సినిమా ప్పుడు కూడా రిలీజ్ అవ్వటం కష్టమే అని అంటున్నారు ఇండస్ట్రీ పెద్దలు. ఎందుకంటే అదే నెలలో నాగ చైతన్య ఇంకా మారుతి కలయిక లో వస్తున్న "శైలజ రెడ్డి అల్లుడు" వస్తుంది. ఈ సినిమా ని ఆగష్టు 31 న రిలీజ్ చేయనున్నట్టు నిర్మాతలు ప్రకటించారు.
 
ఇదిలా ఉంటే తన కొడుకు యొక్క రెండు సినిమాలు ఒకే రోజు విడుదల అవ్వటం ఇష్టం లేని నాగార్జున మైత్రి మూవీ మేకర్స్ వారి దగ్గరకి వెళ్లి "సవ్యసాచి" సినిమాని పోస్ట్ పోన్ చేసుకోమని చెప్పాడు అట. ఎలాగో మూవీ షూటింగ్ ఇంకా పది రోజులు చేయాల్సి ఉంది కాబట్టి "సవ్యసాచి" సినిమాని పోస్ట్ పోన్ చేయటమే కరెక్ట్ అని నాగార్జున భావిస్తున్నాడు అంట. మరి ఇన్ని అడ్డంకుల మధ్య "సవ్యసాచి" ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.