చాలా రోజుల త‌ర్వాత అంద‌మైన అమ్మాయితో రొమాన్స్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

nagarjuna
Updated:  2018-09-17 03:38:59

చాలా రోజుల త‌ర్వాత అంద‌మైన అమ్మాయితో రొమాన్స్

తెలుగు చిత్రపరిశ్ర‌మ‌కు చెందిన రొమాంటిక్ హీరో అక్కినేని నాగార్జున... ఆయ‌న‌ తాజాగా హీరోగా తెర‌కెక్కుతున్న చిత్రం దేవ‌దాస్. ఈ చిత్రం నాగ్, నాని కాంబినేష‌న్ లో తెర‌కెక్క‌నుంది. అయితే ఇప్ప‌టికే ఈ చిత్రానికి సంబంధించి అక్కినేని వార‌సుడు ఒక పోస్ట‌ర్ ను విడుద‌ల చేశాడు. ఈ పోస్ట‌ర్ కు ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న వ‌చ్చింది. ఈ చిత్రంలో నాగ్, దేవ్ పాత్ర‌లో న‌టిస్తుండ‌గా ఆయ‌న‌ స‌ర‌స‌న‌ ఆకాంక్ష సింగ్ హీరోయిన్ గా న‌టిస్తోంది.
 
ఈ క్ర‌మంలో నాగ్  త‌న‌కు ఓ అంద‌మైన అమ్మాయితో రొమాన్స్ చేసే అవ‌కాశం త‌న‌కు ద‌క్కింద‌ని చ‌మ‌త్క‌రించారు. ఈ మేర‌కు ఆయ‌న ట్వీట్ కూడా చేశారు. దేవ‌దాస్ సినిమాలో ఆకాంక్ష జాహ్న‌వి పాత్ర‌లో న‌టిస్తుండ‌గా ఆమెను ప‌రిచ‌యం చేస్తూ సోష‌ల్ మీడియాలో నాగార్జున ఓ పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. చాలా రోజులు తర్వాత నా పక్కన ఒక అందమైన అమ్మాయి!! యా.. రోమాన్స్ ఎగైన్ అని ట్వీట్ చేశారు నాగార్జున.
devadas poster
 
ఈ సినిమాకు సంబంధించి పాట‌ల లిరిక‌ల్ ఈ రోజు సాయంత్రం విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. తెర‌పై రొమాన్స్ పండించే నాగ్ ఈ సినిమాలో ఆకాంక్షతో చేసే రొమాంటిక్ స‌న్నివేశాల‌ను చూడాలంటే ఈ నెల 27వ తేదివ‌ర‌కు ప్రేక్ష‌కులు ఆగాల్సిందే. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.