మామ‌కు థ్యాంక్స్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

samantha and nagarjuna
Updated:  2018-04-12 06:15:23

మామ‌కు థ్యాంక్స్

మెగా ప‌వ‌ర్  స్టార్  రామ్ చ‌ర‌ణ్ హీరోగా న‌టించిన‌ చిత్రం రంగ‌స్థ‌లం... ఈ సినిమాలో చ‌ర‌ణ్ కు స‌ర‌స‌న‌ అక్కినేని నాగార్జున కోడ‌లు స‌మంతా న‌టించింది..మైత్రిమూవీస్ లో తెర‌కెక్కిన ఈ సినిమాకు సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.. అచ్చ‌మైన గోదావ‌రి యాస‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తోన్న ఈ చిత్రం ప్ర‌స్తుతం బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తోంది.
 
ఇక‌ తాజాగా ఈ సినిమాపై హీరో అక్కినేని నాగార్జున ట్వీట్ చేశారు... రంగ‌స్థ‌లం సినిమా తాను చూశాన‌ని ఈ చిత్రంలో  ప్ర‌తీ ఒక్క‌రు అద్భుతంగా  న‌టించార‌ని వారికి ప్ర‌శంశ‌ల వ‌ర్షం కురిపించారు నాగ్ .. దీంతో పాటు త‌న కోడ‌లు స‌మంతా త‌న న‌ట‌న‌తో ఆ పాత్ర‌కు ప్రాణం పోసింద‌ని ట్వీట్ చేశారు మ‌న్మ‌థుడు నాగార్జున‌.. వీరి న‌ట‌న‌ను చూసి చాలా గ‌ర్వ‌ప‌డుతున్నాన‌ని రామ్‌చరణ్‌ కూడా తన పాత్రలో ఒదిగిపోయారని అన్నారు ,  అలాగే డైరెక్టర్ సుకుమార్ మంచి సినిమాను తెరకెక్కించావ్… మళ్లీ పాత రోజుల్ని గుర్తు చేశావ్ అంటూ ట్వీట్ చేశారు.
 
నాగార్జున చేసిన ట్వీట్ కు హీరోయిన్ స‌మంతా రీ ట్వీట్ చేసింది... తాను న‌టించిన చిత్రం చూసి న‌న్ను మెచ్చుకున్నందు థ్యాంక్స్ మామ అంటూ రిప్లై ఇచ్చింది... మామ, కోడలు ఆప్యాయతను చూసిన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.