దర్శకుడు మెహర్ రమేష్ పై సీరియస్ గా ఉన్న నమ్రత శిరోద్కర్

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

namratha
Updated:  2018-10-27 01:50:07

దర్శకుడు మెహర్ రమేష్ పై సీరియస్ గా ఉన్న నమ్రత శిరోద్కర్

ఓవర్ సీస్ లో మహేష్ బాబు కి ఉన్న క్రేజ్ కోసం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. 1 నేనొక్కడినే సినిమా నుండి క్రేజ్ మరింత పెరుగుతూ వచ్చింది. ఆ క్రేజ్ దృష్ట్యా ఓవర్ సీస్ లో మహేష్ బాబు ఏదైన ప్రోగ్రాం కి వస్తున్నడంటే ఆ ప్రోగ్రామ్ కి రెస్పాన్స్ కూడా అలాగే ఉంటది. మా ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) వాళ్ళు ఫండ్ రైసింగ్ కోసం అలాగే మహేష్ ని సంప్రదించి ఒక చారిటీ ఈవెంట్ ని ఏర్పాటు చేశారు.

ఇటివలే అమెరికా లో సూపర్ స్టార్ మహేష్ బాబు చీఫ్ గెస్ట్ గా జరగాల్సిన ఒక ఈవెంట్ కాన్సిల్ అయిన విషయం అందరికి తెలిసిందే. ఈ ఈవెంట్ అలా అక్కడ అమెరికాలో కాన్సిల్ అవ్వగానే ఇక్కడ ఇండియా లో చాలా మంది అసలు మహేష్ బాబుకి క్రేజ్ లేదు అందుకే ఈవెంట్ ఈవెంట్ కాన్సిల్ అయ్యింది అంటూ అన్నారు. టిక్కెట్లు సరిగ్గా అమ్ముడుపోలేదని, అసలు మహేష్ ప్రోగ్రాం కి ఇంత తక్కువ గా అమ్ముడైనందు వల్లే ప్రోగ్రాం క్యాన్సల్ అయిందని వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ మాటలు మహేష్ బాబు భార్య నమ్రత చెవిన పడ్డాయి అంట.

మహేష్ బాబు ఈవెంట్ కేవలం సెక్యూరిటీ రీజన్స్ వల్ల మాత్రమే కాన్సిల్ అయ్యింది అని నమ్రత శిరోద్కర్ చెప్పుకొచ్చింది. అలాగే అసలు ఈ ఈవెంట్ మహేష్ బాబు దగ్గర డైరెక్టర్ మెహర్ రమేష్ ద్వారా వచ్చింది అంట. అమెరికా లో మెహర్ రమేష్ కి తెలిసిన ఫ్రెండ్స్ ఉంటే ఈ ఈవెంట్ కోసం మహేష్ బాబుని అడిగారు అంట. అసలు ఈ ఈవెంట్ ని మహేష్ బాబు దగ్గరకి తీసుకొని వచ్చినందుకు మెహర్ రమేష్ పై సీరియస్ అవుతుంది అంట నమ్రత శిరోద్కర్.