హరికృష్ణ చివరి కోరిక

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

nandamuri harikrishna
Updated:  2018-08-30 18:21:02

హరికృష్ణ చివరి కోరిక

నందమూరి హరికృష్ణ నిన్న ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మనల్ని విడిచి స్వర్గస్థులైన విషయం అందరికి విధితమే. ఆయన మరణం అటు నందమూరి కుటుంబాన్ని ఇటు తెలుగుజాతి ప్రజలను శోకసంద్రంలో ముంచేసింది. ఇక వారి తనయులు కళ్యాణ్ రామ్, జూ.ఎన్టీఆర్ ల మానసిక క్షోభ వర్ణనాతీతం.
 
ఇదిలా ఉండగా, తన ఇద్దరి కొడుకులతో కలిసి ఒక సినిమాలో నటించాలని ఆయన అనుకున్నారని కొంత మంది సినీ ప్రముఖులు ఈ సందర్భంగా తెలియజేసారు. అదే విషయాన్ని కొడుకుల వద్ద కూడా చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కళ్యాణ్ రామ్ ముగ్గురికి తగ్గ కథని రెడి చెయ్యాలని కొంతమంది రచయితలకు సూచించినట్లు వినికిడి.
 
ఆయనే ఆ చిత్రాన్ని నిర్మించి, తమ్ముడు, తండ్రితో కలిసి నటించాలనుకున్నాడు. కానీ ఇంతలోనే ఈ విషాదం ఆ కుటుంబాన్ని అలుముకుంది. చిన్నతనంలోనే నటనారంగంలో ప్రవేశించిన హరికృష్ణ ఆ తర్వాత తన తండ్రి స్థాపించిన రాజకీయ పార్టీకి చైతన్య రథసారథిగా వ్యవహరించాడు. ఇప్పటికి ఆయన తెలుగుదేశం పార్టీకి పోలిట్బ్యూరో సభ్యుడే. గత కొంతకాలంగా ఆయన ఆరోగ్యం సహకరించకపోవడంతో తాత్కాలికంగా రాజకీయాలకు సినిమాలకు దూరంగా ఉంటున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.