జాగ్రత్తగా చూసుకో….ఇక వెళ్తున్నా అంటూ హరికృష్ణ చివరి మాటలు

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

nandamuri hari krishna
Updated:  2018-08-31 02:52:29

జాగ్రత్తగా చూసుకో….ఇక వెళ్తున్నా అంటూ హరికృష్ణ చివరి మాటలు

ప్రముఖ సినీనటుడు హరికృష్ణ మరణం తెలుగు చిత్ర సీమలో చీకటిని నింపింది. ఆయన మరణం సాధారణ ప్రజలనే కలచివేసింది అలాంటప్పుడు ఆయన సన్నిహితుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో తలచుకుంటేనే బాధగా ఉంది. హరికృష్ణ మృతిని ఆయన సన్నిహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని తలచుకొని శోకసంద్రంలో మునిగిపోతున్నారు. 

రమణయ్య గత పదిహేడేళ్ళుగా ఆహ్వానం అనే హోటల్ బాధ్యతల్ని చూసుకుంటున్నారు.. హరికృష్ణ మరణ వార్తను తట్టుకోలేకపోతున్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సార్‌కు ప్రతీది నేనే చూసుకొనే వాడిని అని చెప్పారు. ఆ హోటల్ కి వెళ్లినప్రతిసారి రమణయ్య నే పిలిచి తనకేం కావాలో తెప్పించుకునే వారు.

టీ, టిఫిన్స్, భోజనం ఇలా ప్రతిదీ నన్నే అడిగేవారు. ఆయనకు మాంసాహారం అంటే అమితమైన యిష్టం. హోటల్ సిబ్బందితో కూడా ఆయన ఎంతో ఆప్యాయంగా మెలిగే వారు. ఆయన మొన్న హోటల్ నుండి ఇంటికి వెళ్తూ హోటల్ ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పారని ఆయన బాధాతప్త హృదయం తో చెప్పారు. బుధవారం ఈ వార్త తెలియగానే నాకేం చెయ్యాలో పాలుపొలేదు. అంత ఒక్కసారిగా అంధకారంగా తోచింది.అంతకు ముందు రోజు రాత్రే ఆయన హోటల్ నుండి ఇంటికి వెళ్లడం గమనార్హం.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.