బాలయ్య కొడుకు ఎన్టీఆర్ సినిమాలో ఉన్నాడా?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

balakrishna and mokshagna
Updated:  2018-09-07 05:19:33

బాలయ్య కొడుకు ఎన్టీఆర్ సినిమాలో ఉన్నాడా?

తెలుగు సినీ పరిశ్రమలో వారసుల హవా ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది. ANR, NTR కొడుకులు నాగార్జున, బాలకృష్ణ దగ్గరనుండి వాళ్ళ కొడుకులు హీరోలుగా మారిన వైనం మనం చూస్తూనే ఉన్నాం. దాదాపు వయసుకొచ్చిన ప్రతీ హీరోకోడుకు హీరోగా మారిపోతున్నాడు.
 
నందమూరి నటసింహం బాలకృష్ణ పుత్రుడు మోక్షజ్ఞ హీరోగా వస్తున్నాడని గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. మొన్నామధ్య 2017లోనే మోక్షజ్ఞ సినిమాలోకి వస్తున్నాడంటూ ప్రచారం సాగినా కుదరలేదు. జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ లోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని ఊహాగానాలు వచ్చాయి. కానీ చిత్రం లో ఆయన ఊసే లేదు.
 
ఈ మధ్య మళ్ళీ మోక్షజ్ఞ ఎంట్రీ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈసారి విశ్వవిఖ్యాత నవరసనట సార్వభౌమ ఎన్టీఆర్ జీవితంపై తెరకెక్కిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ లో మోక్షజ్ఞ నటిస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారికంగా ఎటువంటి ప్రకటనలు వెలువడకపోయినా బాలయ్య అభిమానులు మాత్రం మోక్షజ్ఞ ని ఈ చిత్రంలో చూడాలని కోరుకుంటున్నారు. 
 
మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం తాలూక ప్రకటన అతని బర్త్ డే రోజు ఉంటుందని అభిమానులు ఆశించారు. కానీ ఆశలన్నీ అడియాసలు చేస్తూ నందమూరి ఫ్యామిలీ నుండి ఎటువంటి సమాచారం లేదు. ఎన్ టీ ఆర్ బయోపిక్ లో మోక్షజ్ఞ ఉంటున్నాడని సమాచారం అందినా అది ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.