వారిని వదిలేస్తే నాని బాగుపడతాడు..

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

nani
Updated:  2018-10-13 05:39:52

వారిని వదిలేస్తే నాని బాగుపడతాడు..

న్యాచురల్ స్టార్ నాని కెరీర్ ఇంతకు ముందులాగా జోరు సాగట్లేదు, కారణం నానికి ఎదురవుతున్న ఫ్లాప్స్. సరే ఫ్లాప్స్ ఏ హీరో కి అయిన వస్తాయి కాని దాన్ని గ్రహించే శక్తి ఆ హీరోకి ఉండాలి. అది లేకపోతే ఆ హీరో ఎప్పటికి హిట్స్ అందుకోలేడు. ఇప్పుడు నాని అదే పరిస్థితి లో ఉన్నాడు. ఎందుకంటే ఒక భజన బ్యాచ్ ని నమ్మి నాని ఇలా తయారు అయ్యాడు.

మీడియాలో ఒక బ్యాచ్‌తో నాని మంచి రిలేషన్‌ మెయింటైన్‌ చేస్తుంటాడు. నిత్యం వారితో టచ్‌లో వుంటూ ఆత్మీయుడిగా మెలుగుతుంటాడు నాని. దీంతో నానిని విమర్శించడానికి, అతను చేసిన సినిమాలు బాలేదని చెప్పడానికి వారు జంకుతారు. అతను ఏమి చేసినా బాగుందని డబ్బాలు కొడుతుంటారు.  నాని సినిమా విడుదలైన రోజు ఈ బ్యాచ్‌ చేసే హంగామా అలా ఇలా వుండదు. ఫ్లాప్‌ సినిమాలని కూడా అద్భుతాలని చెబుతుంటారు.

వీరిలో కొందరు రివ్యూలు కూడా రాస్తుంటారు కనుక నాని సినిమాని ఆకాశానికి ఎత్తేస్తుంటారు. కృష్ణార్జున యుద్ధం దేవదాస్‌ లాంటి చిత్రాలని కూడా సూపర్‌ అనేసే భజన బ్యాచ్ ఇది. విమర్శలని వినే శక్తి లేక ఇలాంటి వాళ్లని ఎంకరేజ్‌ చేయడం వల్ల నాని రియాలిటీ తెలుసుకోలేడు. నాని మళ్ళి రియాలిటీలోకి వస్తే గాని మళ్ళి హిట్ ఫార్మ్ లోకి రాలేడు అని కొందరి అభిప్రాయం.

 

షేర్ :

Comments

0 Comment