విజయ్ సక్సెస్ నానికి ఇష్టం లేదా..?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

vijay devarakonda and nani
Updated:  2018-08-20 11:19:17

విజయ్ సక్సెస్ నానికి ఇష్టం లేదా..?

విజయ్ దేవరకొండ ఇప్పుడు ఒక స్టార్, ఇక్కడే కాదు ఓవర్సీస్ లో కూడా విజయ్ కి సూపర్ మార్కెట్ ఉంది అని "గీత గోవిందం" నిరూపించింది. ఇటీవలే రిలీజ్ అయిన ఈ సినిమా ఓవర్సీస్ లో మంచి హిట్ గా నిలిచింది. ఇదిలా ఉంటే నాని నటించిన "ఎవడే సుబ్రహ్మణ్యం" అనే సినిమాలో చిన్న పాత్రలో విజయ్ దేవరకొండ. ఇప్పుడు నాని కి మించిన మార్కెట్ ని క్రియేట్ చేసుకున్నాడు విజయ్.

ఇదే మార్కెట్ ఇప్పుడు నానికి విజయ్ కి దూరాన్నిపెంచుతుంది అని తెలుస్తుంది. నాని ఇప్పటి వరకు నటించిన సినిమాలు అన్ని హిట్ ఏ ఒక్క "కృష్ణార్జున యుద్ధం" తప్ప కానీ ఎన్ని సినిమాలు హిట్ అయిన గాని విజయ్ సంపాదించిన క్రేజ్ ని నాని సంపాదించుకోలేక పోయాడు. అందుకే నాని విజయ్ సక్సెస్ ని మనస్పూర్తిగా ఎంజాయ్ చేయట్లేదు అని ఫిల్మ్ నగర్ జనాలు అంటున్నారు.

ఇకపోతే "గీత గోవిందం" ప్రమోషన్స్ కోసం విజయ్ ఇటీవలే బిగ్ బాస్ లోకి వెళ్ళాడు, అక్కడ నాని విజయ్ తో అంతగా ఇంటరాక్ట్ అవ్వలేదు అని ఎపిసోడ్ చూసిన వారు అంటున్నారు. మరి నాని కూడా విజయ్ ని చూసి హిట్స్ తో పాటు తన మార్కెట్ రేట్ ని పెంచుకుంటే మంచిది అని విమర్శకులు అంటున్నారు.

షేర్ :