నాని ఇంకా భయపడుతునే ఉన్నాడా..?

Breaking News

హోమ్        సినిమాలు      న్యూస్

nani
Updated:  2018-10-03 02:13:30

నాని ఇంకా భయపడుతునే ఉన్నాడా..?

నాని అనగానే మనకి గుర్తొచ్చేది, మంచి టైమింగ్ తో కూడిన నటన, సహజత్వం తో కూడిన నటన.. ఈ మధ్య నాని బిగ్ బాస్ అనే షో కి హోస్ట్ గా మారిన సంగతి తెల్సిందే. మొదట్లో నాని సెట్ కాలేదని, నాని హోస్ట్ గా పనికి రాడని విమర్శలు వెల్లువెత్తిన సంగతి కూడా తెల్సిందే.. 

రాను రాను షో కి ఆదరణ పెరిగి నానికి అలవాటు పడ్డారు జనం, కానీ కొత్త చిక్కులు కూడా త్వరగానే మొదలయ్యాయి మనోడికి. షో లో పోటీ చేస్తున్న కౌశల్ పేరున ఏర్పడిన కౌశల్ ఆర్మీ నాని ని ముప్పుతిప్పలు పెట్టింది. మిగతా ఇంటి సభ్యులు లాగే నాని కూడా కౌశల్ ని టార్గెట్ చేస్తున్నాడు అంటూ కౌశల్ ఆర్మీ చేసిన హల్చల్ సోషల్ మీడియా వాడే ప్రతి ఒక్కరికి తెల్సు.

ఎట్టకేలకు బిగ్ బాస్ షో అయిపోయింది... కానీ నాని మాత్రం షో లో హోస్ట్ గా చేసినందుకు కుమిలిపోతున్నాడంట.. ఎందుకంటే దీని వల్ల పేరు రాకపోగా కొత్త శత్రువులు తయారయ్యారు కౌశల్ ఆర్మీ పేరున అని.. బిగ్ బాస్ అయ్యి, కౌశల్ విన్నర్ అయిన నానికి కౌశల్ ఆర్మీ వల్ల పట్టుకున్న భయం పోలేనట్టుంది.. అందుకే తనలో తాను తెగ మదనపడిపోతున్నదంట నాని.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.